చిరంజీవిది ఇంత పెద్ద మనసా?

Chiranjeevi at kwsineni nani daughter weddingమెగాస్టార్ చిరంజీవి రాజకీయాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుని ఇప్పుడు మళ్ళీ సినిమాలలోకి వచ్చేశారు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికలలో ఓడిపోయి ఆ తరువాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. 2014 లో కాంగ్రెస్ ఓటమి తరువాత తన రాజ్యసభ సభ్యత్వం పూర్తి అయిపోయాక పూర్తిగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయితే ప్రజారాజ్యం పార్టీ ఓడిపోవడానికి ఇద్దరు కారణం అని చాలా మంది మెగా అభిమానులతో పాటు మెగా ఫ్యామిలీ వారు కూడా అంటూ ఉంటారు.

[m9ad]

ADVERTISEMENT

ఆ ఇద్దరూ పరకాల ప్రభాకర్, కేశినేని నాని… అప్పట్లో ఎన్నికల ముందు వారిద్దరూ మీడియా ముందుకు వచ్చి ప్రజారాజ్యం పార్టీ పై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో టిక్కెట్లు అమ్ముకుంటున్నారు అంటూ ఆరోపించారు. అక్కడ నుండి ఆ పార్టీ పతనం మొదలు అయ్యింది. అక్కడ నుండి పడటం మొదలు పెట్టి ఎన్నికలలో కేవలం 18 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత జరిగింది చరిత్ర. ముఖ్యమంత్రి కావాల్సిన చిరంజీవి ఇలా ఐపోయాడని మెగా అభిమానులు వారిద్దరి మీద నిప్పులు చెరుగుతారు.

దీని కారణంగానే పవన్ కళ్యాణ్ కూడా తరచూ నానిని టార్గెట్ చేస్తూ మాట్లాడేవారు. అయితే చిరంజీవి కేశినేని నాని కుమార్తె వివాహం హైదరాబాద్ లో నిన్న జరగగా, దానికి హాజరయ్యారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ… నానిని కౌగిలించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ల్లో హల్ చల్ చేస్తుంది. మెగా అభిమానులలో దీనిపై భిన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. కొందరేమో చిరంజీవి మంచి మనసు గురించి గొప్పగా చెబుతుంటే.. కొందరేమో ఇంత మంచితనం పనికి రాదు అని వారి అభిమాన హీరో పై ఒకింత కోపంగానే ఉన్నారు.

ADVERTISEMENT
Latest Stories