‘అన్న’ బాటలోనే పయనిస్తున్న ‘తమ్ముడు’

Chiranjeevi Congragulates K Viswanathమెగాస్టార్ చిరంజీవి రూట్ నే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అనుసరిస్తున్నాడు. అయితే ఇది సినిమాలలోనో, రాజకీయాలలోనో అయితే కాదు..! కళాతపస్వి విశ్వనాథ్ కు ప్రతిష్టాత్మక ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారం వరించిన నేపధ్యంలో… నేడు మెగాస్టార్ చిరంజీవి వెళ్లి విశ్వనాథ్ కు శుభాకాంక్షలు చెప్పి, పుష్పగుచ్చం అందించి, ఆ కళా పురుషుడు నుండి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

అయితే చిరు బాటలోనే పవన్ కూడా విశ్వనాథ్ కు శుభాకాంక్షలు తెలపడానికి బుధవారం నాడు విశ్వనాథ్ చెంతకు విచ్చేయబోతున్నారు. ‘మాటల మాంత్రికుడు,’ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి విశ్వనాథ్ ను కలిసి శుభాకాంక్షలు తెలపనున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తోన్న సినిమాలో ప్రస్తుతం పవర్ స్టార్ నటిస్తున్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories