పదే పదే ఆయన గురించే గూగుల్ ను అడిగేస్తున్నారట!

If-Rumours-Are-True-Then-This-Is-Opportunistic-by-Chiranjeevi!మెగాస్టార్ చిరంజీవిని దైవంగా కొలుస్తారు ఆయన అభిమానులు. అయితే ఆయన పొలిటికల్ హీరోగా మారే క్రమంలో సినిమాలకు గుడ్ బై చెప్పారు. కట్ చేస్తే దాదాపుగా 9 ఏళ్ల పాటు సినిమాలకు దూరం అయిన మెగాస్టార్ కమ్ బ్యాక్ మాత్రం కుమ్మింది అని స్పష్టంగా చెప్పవచ్చు. ఖైదీ నంబర్ 150తో దూసుకువచ్చిన మెగాస్టార్ ని ఆయన అభిమానులు బ్రహ్మ రధం పట్టారు. కట్ చేస్తే ఆ తర్వాత చిరు సైరాతో బిజీ అయిపోయారు.

[m9ad]

ADVERTISEMENT

అయితే ఆయన అభిమానులు మాత్రం చిరు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని గూగుల్ ను పదే పదే అడుగుతున్నారట. ఆ కోవలోనే 2018 లో గూగుల్ లో సౌత్ ఇండియన్ స్టార్ లో ఎక్కువ సార్లు ఎవరి గురించి వెతికారు అంటే ఇంకెవరు మన మెగాస్టార్ నే పదే పదే వెతికారని గూగుల్ తాజాగా విడుదల చేసిన జాబితాలో తేలింది. చిరు సైరా సినిమా గురించి విశేషాలు తెలుసుకునే క్రమంలో చిరుని ఎక్కువగానే వెతికారట యావత్ తెలుగు వాళ్ళు.

ఇక చిరు తర్వాత స్థానంలో నాని, బాలయ్య, విజయ్ దేవరకొండ తదితరులు ఉన్నారట. అయితే సినిమాల విషయంలో మాత్రం టాప్ ప్లేస్ విజయ్ గీత గోవిందంకి దక్కగా…ఆతర్వాత తమిళ సినిమా సర్కార్ కి దక్కింది. మొత్తంగా చూసుకుంటే మాత్రం చిరుకి దాదాపుగా 9 ఏళ్ళపాటు గ్యాప్ వచ్చినా, మరో పక్క 150 సినిమా తర్వాత ఏడాది సినిమా లేకపోయినా ఆయనపై అభిమానం మాత్రం చెక్కు చెదరలేదని గూగుల్ సైతం చెప్పడం విశేషం.

ADVERTISEMENT
Latest Stories