మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తోన్న సినిమా కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకరకంగా చెప్పాలంటే… ‘బాహుబలి 2’ స్థాయిలో ఈ ఏడాదిలో సినీ ప్రేక్షకులు నిరీక్షిస్తున్న సినిమాగా దీనికి ప్రత్యేక క్రేజ్ వచ్చిపడింది. అయితే ఈ సినిమాకున్న క్రేజ్ ఏమిటో తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఫోటో చెప్పకనే చెప్తోంది.
హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా సెట్స్ కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యక్షమయ్యారు. స్క్రీన్ పైన ఏదో సీన్ ను తీక్షణంగా చూస్తున్నట్లుగా ఉన్న ఈ ఫోటోను సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పోస్ట్ చేసారు. మెగాస్టార్ చిరంజీవితో ‘స్టాలిన్’ సినిమాను తెరకెక్కించిన మురుగదాస్ కు మెగా వర్గంతో మంచి అవినాభావ సంబంధం ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ తో ఓ సినిమా కోసం మెగా కాంపౌండ్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
అలాగే ఇటీవల కాలంలో ప్రిన్స్ మహేష్ బాబుకు – మెగా వర్గానికి మధ్య బంధం బలపడుతోందని సినీ వర్గాలు చెవులు చెప్పుకుంటున్నాయి. కొత్త సంవత్సరం వేడుకలను ప్రిన్స్ ఫ్యామిలీ – రామ్ చరణ్ కుటుంబం జరుపుకున్న విషయం తెలిసిందే. అలాగే నమ్రత పుట్టినరోజు సందర్భంగా కూడా ఏర్పాటు చేసిన పార్టీలో చెర్రీ అండ్ కో ప్రత్యక్షమయ్యారు. తాజాగా ప్రిన్స్ సెట్ లో మెగాస్టార్… ఈ వాతావరణమే కదా సినీ ప్రేక్షకులకు కావాల్సింది..!



