అనతికాలంలోనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఎదిగాడు కొరటాల శివ. ఇప్పటివరకు ఆయన కెరీర్ లో ఒక్క ఫెయిల్యూర్ కూడా లేదు. కొరటాల ఇప్పటివరకు తన ప్రతీ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నారు. అయితే మొట్టమొదటి సారిగా మెగాస్టార్ చిరంజీవితో తన తదుపరి చిత్రానికి మార్పు చేస్తున్నాడు.
ఈ సినిమా కోసం ఒక బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ని రంగంలోకి దింపాడు కొరటాల. ఇటీవలే కాలంలో బాలీవుడ్ లో అగ్నీపత్, సైరాత్ వంటి మంచి ఆల్బమ్స్ ఇచ్చిన అజయ్ – అతుల్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించబోతున్నారట. తొందరలో వారు సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టబోతున్నారు.
చిరంజీవి హిస్టారికల్ సినిమా, సైరా సినిమాకు కూడా ఇద్దరు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేస్తున్నారు. చిరంజీవి – కొరటాల సినిమా నవంబర్ లో మొదలయ్యే అవకాశం ఉంది. ఇక కథ విషయానికి వస్తే…. ఈ సినిమా స్టోరీకి నక్సల్ బ్యాక్ డ్రాప్ ఉంటుందని సమాచారం. ఈ చిత్ర మేజర్ గా శ్రీకాకుళం జిల్లా పలాసలో జరుగనుందని తెలుస్తుంది.
చిరంజీవి సినిమాను తనయుడు రామ్ చరణ్ నిర్మించనున్నాడు. ఈ సినిమాను ఉగాది సందర్భంగా విడుదల కానుందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అనేక పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ ఎవరిని అధికారికంగా ధ్రువీకరించలేదు





