రామ్ చరణ్ కోసం చిరంజీవి!

Chiranjeevi on the sets of ram charan upcoming movieకొణిదెల ప్రొడక్షన్స్ పై నిర్మాణం జరుగుతోన్న చిరు “సైరా” సినిమా కోసం రామ్ చరణ్ అనేక మార్లు షూటింగ్ స్పాట్స్ లో దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రామ్ చరణ్ సినిమా షూటింగ్ స్పాట్ లో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యక్షం అయ్యారు. అజర్బేజాన్ లో జరుగుతున్న చెర్రీ సినిమా షూటింగ్ ను చూసేందుకు చిరంజీవి వచ్చిన ఫోటోను స్వయంగా నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది.

[m9ad]

ADVERTISEMENT

“మెగాస్టార్ చిరంజీవి మా సినిమా సెట్స్ పైకి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నామని” చెప్తూ చిరు – దానయ్యలు ఉన్న ఫోటోను పోస్ట్ చేసారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ కు జతగా ‘భరత్ అనే నేను’ ఫేం కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేసేందుకు నిర్మాత డివివి దానయ్య సన్నాహాలు చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories