ప్రస్తుతం తెలుగు సినిమాను ఏలుతున్నాడని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి డిక్లేర్ చేసాడు. ఒకప్పుడు తాను మెచ్చుకుని బహుమతిగా తన వద్ద ఉన్న ‘వాచ్’ ఇచ్చి, ఇక నుండి నీ టైం మారిపోతుంది అని చెప్పిన వ్యక్తే సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అని… అప్పటి నుండి ఇప్పటివరకు నిర్మాతల పాలిట దేవుడిగా మారాడని, అయితే ప్రస్తుతం ఈ నెంబర్ “1” సంగీత దర్శకుడు తన తదుపరి చిత్రానికి సంగీతం అందించాల్సిందిగా డేట్స్ అడుగుతుంటే, సమయం లేదంటూ తప్పించుకుని తిరుగుతున్నాడని, ఎట్టకేలకు ఈ రోజు తనకు దొరికాడని చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆడిటోరియంలో నవ్వులు పూయించాయి.
ఇపుడు మీ అందరి సాక్షిగా అడుగుతున్నాను… నా 150వ సినిమాకు చేస్తావా… అంటూ చిరు అడిగిన దానికి ఈ సంగీత సంచలనం తల ఊపడంతో… ఒప్పుకున్నాడు… మీరే సాక్ష్యం… తప్పించుకోలేడు… అంటూ మెగాభిమానులను ఆనందంలో ముంచెత్తారు. అంతకుముందు ‘గబ్బర్ సింగ్’ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన దేవి, ఈ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాకు కూడా అదిరిపోయే మ్యూజిక్ ను అందించాడని చిరు పొగడ్తల వర్షంలో మునిగితేలాడు దేవిశ్రీప్రసాద్.





