రీమేక్ సెటప్ అంతా రామ్ చరణ్ దే!

chiranjeevi speech about ramcharan at godfather pre release eventతెలుగు సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంనతపురంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి, సత్యదేవ్, ఆర్ బి చౌదరి, రామ్ లక్ష్మణ్ లు, థమన్, రామజోగయ్య శాస్త్రి, మోహన్ రాజా విచ్చేసారు.

మెగాస్టార్ మాట్లాడుతూ… “అసలు మలయాళం సినిమా ‘లూసిఫర్’ ని రీమేక్ చెయ్యడానికి ముఖ్య కారణం రాంచరణ్” అని అన్నారు. “రాంచరణ్ కి లూసిఫర్ సినిమా బాగా నచ్చిందని, నా ఇమేజ్ కి తగ్గ స్టోరీ అని చెప్పగా నేను చెయ్యడానికి ఒప్పుకున్నాను” అని అన్నారు.

ADVERTISEMENT

నా పక్కన ఒక ముఖ్య పాత్రలో నటించడానికి సల్మాన్ ఖాన్ ని ఒప్పించింది కూడా రాంచరణ్ అని చిరంజీవి చెప్పారు. తాను ఒక్కడే ఈ భారీ సినిమాని నిర్మించలేనని, అందుకు సూపర్ గుడ్ సంస్థ ని కూడా కలుపుకుని, ఈ గాడ్ ఫాదర్ సినిమా ని భారీగా నిర్మిస్తానని రామ్ చరణ్ ముందుకు రావడం తో, మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నానన్నారు.చివరికి దర్శకుడు మోహన్ రాజా ని కూడా రామ్ చరణే ఎంపికచేశారని చెప్పారు.

తండ్రి చిరంజీవి హీరోగా చేసే సినిమాకి అన్నీ తానై రామ్ చరణ్ చూసుకోవడం విశేషం. రామ్ చరణ్ గురించి చిరంజీవి చెప్తూ మురిసిపోవడం అభిమానుల్ని ఆకట్టుకుంది. రామ్ చరణ్ ఎన్నుకున్న వారందరూ చాలా నిష్ణాత్తులే. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఫలితం చెబుతుంది రామ్ చరణ్ ఎంపిక తప్పా? ఒప్పా? అని.

వర్షంలో తడుస్తూ కూడా మెగాస్టార్, ఈ సినిమాకి పనిచేసినవారందరినీ పొగిడారు. తన సినిమాతో పాటు వస్తున్న ఘోస్ట్, స్వాతిముత్యం సినిమాలు కూడా హిట్ అవ్వాలని కోరుకున్నారు. అభిమాలే తనకు గాడ్ ఫాథర్లని, వారి నిర్ణయానికి శిరసా వహిస్తానని చెప్పడం విశేషం.

ADVERTISEMENT
Latest Stories