చిరు స్టేట్మెంట్… పబ్లిసిటీ స్టంట్..!

chiranjeevi statement publicity stunt“తనను నమ్మి ‘మిషన్ ఇంపాసిబుల్’ సినిమాకు వెళ్ళండి, మిమ్మల్ని ఖచ్చితంగా రంజింప చేసే చిత్రంగా ఉంటుంది, ఇది నా భరోసా” అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ ఓ భారీ ప్రకటనే ఇచ్చారు. చిన్న సినిమా కావడంతో అప్పటివరకు లేని అటెన్షన్ చిరు స్టేట్మెంట్ తో, ఈ సినిమా ఒక్కసారిగా పబ్లిసిటీ పొందింది.

మరి శుక్రవారం నాడు రిలీజ్ అయిన “మిషన్ ఇంపాసిబుల్” మెగాస్టార్ ఇచ్చిన ప్రకటనకు తగిన విధంగానే ఉందా? అంటే ఖచ్చితంగా లేదనే టాక్ వెలువడింది. ఫస్టాఫ్ పర్లేదనిపించగా, సెకండాఫ్ పూర్తిగా గాడి తప్పి క్లైమాక్స్ కు వెళ్లే సరికి అది ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేదిగా మారిపోవడంతో, ఈ ‘మిషన్ ఇంపాసిబుల్’ సినిమాకు ప్రేక్షకుల రాక కూడా ‘ఇంపాసిబుల్’ అని తేలిపోయింది.

ADVERTISEMENT

తన “ఆచార్య” సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ ‘మిషన్ ఇంపాసిబుల్’ కోసం మెగాస్టార్ అంతటి భారీ ప్రకటన ఇవ్వడం అవసరమా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. సినీ పరిశ్రమలో కొంతమంది ఇచ్చే ప్రకటనలు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. కమర్షియల్ గా సినిమాలను కరెక్ట్ గా జడ్జ్ చేస్తారని చిరంజీవికి ప్రత్యేకమైన పేరుంది, చాలా సందర్భాలలో నిరూపణ అయ్యింది కూడా!

అలాంటి చిరు, ‘మిషన్ ఇంపాసిబుల్’ని సరిగ్గా అంచనా వేయలేకపోయారా? లేక తన ‘ఆచార్య’ నిర్మాత కోసం పబ్లిసిటీ స్టంట్ లో భాగంగా అంతటి భారీ ప్రకటనను చేయవలసి వచ్చిందా? ఇండస్ట్రీ పెద్దగా ఓ చిన్న సినిమా కోసం తన వంతు సాయం చేయాలని చిరు చేసిన ప్రయత్నం బానే ఉంది గానీ, సినిమాలో విషయం లేకపోతే చిరంజీవే కాదు, ఎవరూ చెప్పినా ప్రేక్షకులు చూడరని మరోసారి నిరూపణ అయ్యింది.

ADVERTISEMENT
Latest Stories