చిరంజీవి మంచి నిర్ణయమే తీసుకున్నారు

Chiranjeevi took right decission to postpone of sye raa pre releaseమెగాస్టార్‌ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సైరా’ సినిమా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నాలుగు భాషల్లో ఒకేరోజు విడుదల కాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ నెల 18న అంటే ఈ రోజు ఎల్బీ స్టేడియంలో భారీ ఈవెంట్ ప్లాన్ చేసింది చిత్రబృందం. అయితే వాతావరణం కారణంగా ఈ ఈవెంట్ ఈ నెల 22కు వాయిదా పడింది.

అయితే ఇప్పుడు అది చాలా మంచిదే అని చెప్పుకోవాలి. నిన్న రాత్రి హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. ఈరోజు సాయంత్రం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు. ఈ ఈవెంట్ కు బుక్ చేసిన వేదిక… ఎల్బీ స్టేడియం అంటే ఇది పూర్తిగా అవుట్ డోర్ ఈవెంట్. వర్షం కురిస్తే మొత్తం ప్లాన్ అప్సెట్ అవుతుంది. ఈ ఈవెంట్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుండి అభిమానులు వస్తారు. ఈవెంట్ జరిపి ఉంటే వారంతా ఇబ్బంది పడేవారు. దీనితో ఈ ఈవెంట్ వాయిదా వేసి మంచి నిర్ణయం తీసుకున్నారనే చెప్పుకోవాలి.

ADVERTISEMENT

ఇది ఇలా ఉండగా సైరా ట్రైలర్ కొద్ధి గంటలలో విడుదల అవుతుంది. దీని కోసం అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. సినిమా కు ఇప్పటివరకు చిత్రబృందం ఎటువంటి ప్రమోషన్స్ చెయ్యలేదు. ఈ ట్రైలర్ మొత్తం పని చూసుకుంటుందని వారి అంచనా. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ,కన్నడ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేయనున్నారు. అన్ని భాషలలోనూ భారీగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. దేశంకోసం పోరాడిన ఒక వీరుడి గాధను దేశవ్యాప్తంగా పరిచయం చెయ్యాలని చిరంజీవి ఆశపడుతున్నారు. అందుకే దేశవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories