తమిళ ‘అర్జున్ రెడ్డి’ బీభత్సం!

Chiyaan Vikram Kid - Dhruv Cara Accidentతెలుగులో “అర్జున్ రెడ్డి” ద్వారా విజయ్ దేవరకొండ సిల్వర్ స్క్రీన్ పై బీభత్సం చేయగా, తమిళంలో ఈ సినిమాను రీమేక్ చేస్తోన్న ‘చియాన్’ విక్రమ్ తనయుడు ధృవ్ ఆఫ్ స్క్రీన్ లో బీభత్సాన్ని స్టార్ట్ చేసారు. చెన్నైలో అతి వేగంతో కారును నడుపుతూ రోడ్డు పక్కన ఉన్న ఓ ఆటోను డీ కొట్టడంతో వార్తల్లోకి ఎక్కిన ధృవ్, ప్రస్తుతం చిక్కుల్లో పడ్డారు.

ఈ ఆటోలో ఉన్న డ్రైవర్ కాలు విరిగిపోగా, అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని సమాచారం. విషయం తెలుసుకున్న పాండిబజార్ పోలీసులు కారును స్వాధీనం చేసుకుని ధృవ్ ని విచారణ జరుపుతున్నారు. కారు నడుపుతున్న సమయంలో ధృవ్ మద్యం సేవించి ఉన్నాడా? లేక కారు బ్రేకులు ఫెయిల్ అయ్యాయా? అనేది తెలియాల్సి ఉంది.Chiyaan Vikram son - Dhruv Cara Accident

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories