టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ ముద్దుకుండే ప్రాధాన్యతే వేరు..ఎందుకంటే ముద్దులతో ఫేమస్ అయిన వారు చాలా మందే ఉన్నారు. కానీ పాపం అదే ముద్దు వలన తీవ్ర వ్యతిరేకతను ఏరి కోరి తెచ్చుకున్నాడు మన క్యామేరా మన్ చోటా కే నాయుడు. ఆయన గతంలో ఒక వేడుకలో కాజల్ అగర్వాల్ ను ముద్దు పెట్టుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.
[m9ad]
అయితే ఆ విషయంలో పాపం కాజల్ కి ఏమాత్రం పెద్దగా తప్పు అనిపించలేదు కానీ…సోషియల్ మీడియా నుంచి సినిమా సర్కిల్స్ వరకూ అందరూ దాన్ని ఖండించారు. అయితే సినిమా వాళ్ళకు అవన్నీ షరా మామూలే అనుకోండీ. ఇదిలా ఉంటే మరో పక్క ఈరోజు జరిగిన బెల్లంకొండ శ్రీనివాస్ “కవచం” సినిమా ఆడియోలో కూడా చోటా కాజల్ గురించి మాట్లాడాడు. ఆమె ఈ సినిమాకి చాలా కష్ట పడింది అని…ఇసుక తుఫానును కూడా లెక్కచెయ్యకుండా చాలా కష్టపడి ఈ సినిమాను చేసింది అని, సినిమా పట్ల అంత డెడికేషన్ చూపించడం వల్లనే ఆమె ఆ స్థాయిలో ఉంది అని, షరా మామూలుగా పొగడ్తల్లో ముంచెత్తేశాడు.
ఇక గత ముద్దు అనుభవం గుర్తుందో ఏమో తెలీదు కానీ తన స్పీచ్ ఆధ్యంతం ఎక్కడా ఆ టాపిక్ గురించి మాట్లాడకుండా చివర్లో కాజల్ ను…”ఈ లవ్ యు డార్లింగ్…లవ్ యూ నాన్న” అంటూ సరిపెట్టాడు. అయితే పైకి పెద్దగా గత అనుభవం గురించి చోటా కనిపించనప్పటికీ లోలోపల మాత్రం ఆ అనుభవం నేర్పిన పాఠం అనుకోవాలో ఏమో కానీ..సింపిల్ గా సుత్తి లేకుండా డార్లింగ్ అంటూ ముగించాడు. మొత్తంగా ముద్దు తెచ్చిన తిప్పలతో కాస్త జాగ్రత్త పడ్డాడు చోటా అని చెప్పుకోవచ్చు.



