తమిళులకు సినీ జనాల సాయం

cine heroes donation to chennai flood affected peopleతమిళనాడులో గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు రాష్ట్ర ప్రజలు అంతా కూడా అష్ట కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా రాజధాని చెన్నైలో పరిస్థితి దారుణంగా ఉంది. వ్యవసాయంతో పాటు దాదాపు అన్ని రంగాలపై కూడా ఈ వర్షాల ప్రభావం ఉంది. కోన్ని వేల కోట్ల నష్టం ఈ వర్షాల వల్ల జరుగుతోంది. కనీసం సాయం కూడా అందించలేనంతగా వర్షాలు వస్తున్నాయి. వర్షాల వల్ల సర్వం కోల్పోయిన ప్రజలను ఆదుకునేందుకు టాలీవుడ్‌ నుండి పలువురు స్టార్‌ ముందుకు వస్తున్నారు.

కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ తన వంతు సాయంగా 10 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించనున్నట్లుగా ప్రకటించారు. ఇక సూర్య మరియు కార్తీలు కలిసి 25 కోట్లు, విశాల్‌ 10 లక్షలు, ధనుష్‌ 5 లక్షలు ఇలా పలువురు స్టార్స్‌ తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. టాలీవుడ్‌ నుండి సైతం సంపూర్నేష్‌బాబు తనవంతు సాయం అందిస్తాను అంటూ ముందుకు వచ్చాడు. తన సాయంను త్వరలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిసి అందజేయబోతున్నట్లుగా సంపూ స్వయంగా ప్రకటించాడు. తెలుగు హీరోలు సైతం పలువురు తమిళ జనాలకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. మరో వైపు ప్రజలను ఆదుకునేందుకు జయ ప్రభుత్వం చాలా కృషి చేస్తోంది.

ADVERTISEMENT
Latest Stories