కామన్ మాన్ పల్స్ పట్టుకుంటున్న సీజేపీ….

Cockroach Janata Party’s New Political Strategy

పార్టీ పేరుతోనే భారతదేశ రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన ‘కాక్రోచ్ జనతా పార్టీ’ చాపకింద నీరు మాదిరి దేశ రాజకీయాలలోకి చొచ్చుకొస్తుంది. అందుకు వారు ఎంచుకుంటున్న నినాదాలు సామాన్య ప్రజానీకానికి అతి చేరువలో ఉంటున్నాయి.

మొన్న దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ లో సీజేపీ చేపట్టిన నీట్ ఉద్యమం కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని జవాబుదారీ చేసింది. సాక్ష్యాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం తన పంథా మార్చుకుని మరి సోషల్ మీడియాలో హాయ్ ఫ్రెండ్స్ అంటూ జీన్ జీల ఆకర్షణకు ముందుకొచ్చారు.

ADVERTISEMENT

నీట్ పేపర్ లీకేజ్, రీ ఎక్సమ్ లతో లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లితండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇక మరికొంతమంది విద్యార్థులు ఆ పరీక్షల ఒత్తిడిని ఎదుర్కోలేక బలవన్మరణాలకు పాల్పడ్డాడు. ఆ విద్యార్థుల బలవన్మరణాలు దేశ ప్రజలను సైతం కంటతడిపెట్టించాయి.

ఇలా కామన్ మాన్ పల్స్ పట్టుకున్న సీజేపీ విద్యార్థులకు మద్దతుగా నీట్ ఉద్యమం ప్రారంభించి ప్రజల మద్దతు తో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచింది, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కు పట్టుబట్టింది. దీనితో దేశ వ్యాప్తంగా సీజేపీ పేరు మరోమోగిపోయింది.

ఇక ఇప్పుడు సీజేపీ ఎత్తుకున్న మరో నినాదం కూడా ఇలానే సామాన్యుడి ఆలోచనకు అతి చేరువలో ఉంది. దేశంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్నతాధికారులు, టీచర్లు, మంత్రులు, రాజకీయ నాయకులు అందరు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని, అప్పుడే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడుతాయనే డిమాండ్ తో ముందుకొస్తున్నారు.

జీన్ జీ ల ఆకర్షణే తమ లక్ష్యం అంటూ ముందుకెళుతున్న సీజేపీ ఫౌండర్ అభిజిత్ దేశ వ్యాప్తంగా ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారాన్ని ప్రారంభించారు. అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల సందర్శనకు వెళుతున్న అభిజిత్ అక్కడ విద్యార్థులు ఎదుర్కొటున్న సమస్యల పై గళం విప్పుతున్నారు.

ప్రభుత్వ పాఠశాలల నాణ్యత, అక్కడ విద్యార్థులకు అందించే విద్యా, మౌలిక వసతులు పై స్పందిస్తున్న అభిజిత్ ఈ రకమైన కామెంట్స్ చేసారు. పేద విద్యార్థుల కోసం సాదా సీదా వసతులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ బడులు ఏమేరకు వారి అభ్యున్నతికి బాటలు వేయగలవు.? అంటూ నిలదీస్తూనే,

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మంత్రులు, రాజకీయ నేతలు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని, అప్పుడే అక్కడ వసతులు మెరుగుపడి, ఉన్నత విద్య అందరికి అందుబాటులోకి వస్తుందంటూ ప్రచారం మొదలుపెట్టారు.

అయితే ఈ ఆలోచన ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి అతి దగ్గర ఉంది. సామాన్యుడి సంపాదనలో సింహ భాగం విద్యా, వైద్యానికే సరిపోవడం లేదు. తమ పిల్లలకు ఉన్నత విద్య అందించడం కోసం స్తొమత లేకపోయినా ప్రజలు ప్రవైట్ పాఠశాలల వైపే మొగ్గుచూపుతున్నారు, కార్పొరేట్ వైద్యం వెనుకే పరుగులు పెడుతున్నారు.

ఇటువంటి పరిస్థితులలో సీజేపీ ఫౌండర్ అందుకున్న ఈ నినాదం సామాన్యుడి పల్స్ పట్టినట్టయ్యింది. సీజేపీ వేస్తున్న ప్రతి అడుగు, ఎత్తుకుంటున్న ప్రతి అంశం రాజకీయాలకు అతీతంగా సామాన్యుడి మనసుని కదిలిస్తుంది. కాబట్టి రాబోయే దేశ రాజకీయాలలో సీజేపీ ప్రభావం రాజకీయ పార్టీల మీద గట్టిగానే పడేలా కనిపిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories