డైరెక్షన్ చేస్తా… పక్కా..!

Comedian dhanaraj wish to direct a movieబుల్లితెరపై సూపర్ హిట్ గా నిలిచిన ‘జబర్దస్త్’ షో ద్వారా పాపులర్ అయిన కమెడియన్ ధనాధన్ ధన్ రాజ్, సిల్వర్ స్క్రీన్ పై కమెడియన్ గా రాణిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తో ‘గోపాల గోపాల, కెమెరామెన్ గంగతో రాంబాబు, సర్ధార్ గబ్బర్ సింగ్’ వంటి పెద్ద సినిమాలలో నటిస్తూనే, చిన్న సినిమాలు చేస్తున్న ధన్ రాజ్… “ధనలక్ష్మీ తలుపు తడితే…” సినిమాను నిర్మించి కాస్త చేతులు కాల్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ద్వారా తాను ఒక రూపాయి నష్టపోయానేమో గానీ, ఎవరికీ ఒక్క రూపాయి కూడా బాకీ లేనని గర్వంగా చెప్పారు.

ADVERTISEMENT

ప్రస్తుతం ప్రాధాన్యత లేని పాత్రలు కూడా అనేకం చేస్తున్నానని, అయితే భవిష్యత్తులో ఇలాంటి పాత్రలను దక్కించి, గుర్తింపు తెచ్చుకునే పాత్రలే చేయాలని భావిస్తున్నానని చెప్పిన ధన్ రాజ్, త్వరలో రాబోతున్న “లండన్ బాబులు” సినిమాలో మాజీ నక్సలైట్ పాత్రను పోషించానని, సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర ఇదని, ప్రేక్షకుల ఆదరణ పొందితే ఈ సినిమాలోని తన పాత్రకు అవార్డు కూడా దక్కుతుందేమో అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసాడు. అలాగే అనుష్క నటిస్తోన్న “భాగమతి” సినిమాలో అనుష్క పక్కనే ఉండే ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నానని చెప్పారు.

నటుడిగా ఇలా బిజీగా ఉన్న తాను, ఖచ్చితంగా డైరెక్షన్ చేస్తానని, అది తన డ్రీం అని చెప్పిన ధన్ రాజ్, తన సొంత కధతోనే ఒక మంచి సినిమాకు దర్శకత్వం వహిస్తానని స్పష్టం చేసాడు. ఇదే సమయంలో ఓ 71 రోజుల పాటు స్పెషల్ కార్యక్రమంకు వెళ్తున్నానని, అది వెళ్లి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా మొదలు పెడతానని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సదరు సంగతులన్నీ చెప్పుకొచ్చాడు. నిర్మాతగా కూడా భవిష్యత్తులో మంచి సినిమాలను నిర్మించాలనే కుతుహాలం తనకు ఉందని ఈ సందర్భంగా స్పష్టత ఇచ్చా

ADVERTISEMENT
Latest Stories