‘ఇస్తే తీస్కో… అంతే కానీ లాక్కోకు’ అని పవన్ చెప్పారు!

prudhvi replaces brahmiటాలీవుడ్ లో ప్రస్తుతం మోత మోగిస్తున్న కమెడియన్ లలో ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ’ ఒకరు. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ‘బెంగాల్ టైగర్’ ద్వారా మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ఒకప్పుడు క్యారెక్టర్ల కోసం వెతుక్కుంటూ తిరిగిన పృథ్వీ కోసం, ప్రస్తుతం క్యారెక్టర్లే వెతుక్కుంటూ వస్తున్నాయి. అంతలా పాపులర్ అయిన పృథ్వీ తన అనుభూతులను మీడియా వర్గాలతో పంచుకున్నారు.

ఇండస్ట్రీనే నమ్ముకున్న తనకు మొదటి నుండి చిత్ర పరిశ్రమే అన్నం పెట్టిందని, ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒక్క వేషం దొరికితే చాలనుకున్న రోజులున్నాయని, గత ఏడాది ‘లౌక్యం’ సినిమాతో అవకాశాలు పెరిగాయని, ప్రస్తుతం ‘బెంగాల్ టైగర్’తో మరింత పేరు వచ్చిందని, తనకు లభిస్తున్న ఆదరణ పట్ల సంతోషంగా ఉందన్న పృథ్వీ, ఈ సందర్భంగా పవన్ చెప్పిన ఓ మాటను గుర్తు చేసుకున్నారు.

‘ఇస్తే తీస్కో… అంతే కానీ లాక్కోకు…’ అని పవన్ ఇచ్చిన ఉపదేశం తను బాగా అనుసరిస్తానని… ‘ఆ ఒక్కటీ అడక్కు’ నుండి మొదలైన నా సినీ కెరీర్ లో ‘ఖడ్గం’ తొలి బ్రేక్ ఇచ్చిందని, ఆ తర్వాత నుండి చిన్న చిన్న అవకాశాలు వస్తూ ఉన్నాయని, ఇందుకు కారణమైన వారందరికీ కృతఙ్ఞతలు చెప్పుకొచ్చారు పృథ్వీ.

ADVERTISEMENT
Latest Stories