సునీల్ ఏంటి అలా అనేసాడు!

Comedian Sunil Allu Arjun pushpa movie pre release event‘మంగళం శ్రీను’గా “పుష్ప” సినిమాలో నటించిన సునీల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నెల 17వ తేదీన “పుష్ప” రిలీజ్ అవుతోంది, 18వ తేదీ నుండి ఇంటికి తాళం వేసి, సుకుమార్ ఇంట్లో లేడని బయట ఇద్దరు మనుషులు పెట్టి చెప్పించండి… అంటూ సుకుమార్ సతీమణి గారికి సలహా ఇచ్చారు సునీల్.

ADVERTISEMENT

ఓ రెండు సెకన్లు గ్యాప్ ఇచ్చి, ‘కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పండి’ అంటూ ముగించారు సునీల్. అయితే ఈ వ్యాఖ్యలలో కాస్త ద్వంద్వార్ధాలు ప్రస్ఫుటించడంతో ట్రోల్ చేయడం నెటిజన్ల వంతయ్యింది. ఇలాంటి స్టఫ్ ఇస్తే సోషల్ మీడియా జనులు ఊరుకుంటారా?! సునీల్ ఏంటి రిలీజ్ కు ముందే అంత మాట అనేశారేంటి? అంటూ అవాక్కవుతున్నారు.

ఇక సునీల్ మాట్లాడిన ఇతర విశేషాలను చూస్తే… నన్ను చూస్తే మీ అందరికి భయం వేస్తుంది, అనసూయను చూస్తే సినిమాలో నాకు భయమేస్తుంది. ఒక్క తెలుగులోనే నేను విలన్ గా చేద్దామనుకున్నా, కానీ ఈ టీమ్ పుణ్యమా అంటూ టోటల్ ఇండియాకే విలన్ అయిపోతున్నాను, దీనికి సుకుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ADVERTISEMENT
Latest Stories