
2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పుతో తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. పదేళ్ల దొరల పాలనకు స్వస్తి చెపుదాం…ప్రజాపాలన కొనసాగిద్దాం, మార్పు కావాలి…కాంగ్రెస్ రావాలి అంటూ కాంగ్రెస్ ఇచ్చిన నినాదం తెలంగాణ ప్రజల ఆలోచనలో మార్పు తీసుకువచ్చింది.
దీనితో తమ ఓటమి అసాధ్యం అంటూ విర్రవీగిన నేతలను సైతం ఇంటికి పరిమితం చేసారు తెలంగాణ ప్రజలు. దానితో తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిపోయారు బిఆర్ఎస్ నాయకులు, వారి అధినేత. అయితే ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల సందడి మొదలుకావడంతో మళ్ళీ తెరమీదకు వచ్చారు బిఆర్ఎస్ నేతలు, వారి అధినేత కేసీఆర్.
ప్రజాస్వామ్య బద్దంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోబోతుందని, ఆ పార్టీలో చాల మంది నేతలు తమకు టచ్ లో ఉన్నారంటూ నమ్మడానికి కాదు కదా వినడానికి కూడా ఆసక్తి లేని వ్యాఖ్యలు చేస్తూ తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారు కేసీఆర్. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు చేయాల్సిన విమర్శల హద్దుని దాటి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఒక పక్క లిక్కర్ కేసులో కూతురు కవిత అరెస్టయ్యి తీహార్ జైల్లో ఉన్నప్పటికీ, మరో పక్క కొడుకు కేటీఆర్ ఫోన్ టాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటు జైలుకు వెళ్ళడానికి సిద్దమయినప్పటికీ కేసీఆర్ లో అహంకారం పోలేదని ముఖ్యమంత్రి రేవంత్ కేసీఆర్ తీరుని తప్పుబట్టారు. అసెంబ్లీ కి వచ్చి ప్రజాసమస్యల మీద చర్చించే ఓపిక లేదుకానీ మీడియా ఛానెల్స్ లో 4 గంటల పాటు చర్చ కార్యక్రమాలలో పాల్గొనే తీరిక ఉందా కేసీఆర్ కు అంటూ ప్రశ్నించారు.
అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్ లోకి అడుగుపెట్టడానికి కూడా అనుమతించని మీడియా దగ్గరకు ఇప్పుడు అధికారం కోసం వెళ్లడం కేసీఆర్ నైజం ను తెలియచేస్తుందని, అందితే జుట్టు అందక పొతే కాళ్ళు కేసీఆర్ రాజకీయంలో భాగమే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. మా పార్టీ నేతలు మీకు టచ్ లో ఉండడం కాదు, పార్లమెంట్ ఎన్నికల తరువాత మీ పార్టీ కారు ఖాళీ అవడం ఖాయం అంటూ ధీమాగా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీలోని ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…