పవన్ కోసం తహతహలాడుతున్నారు!

pawan-kalyan-responded-first-time-on-baahubaliఎప్పుడైతే సినిమాలను వదిలేసి రాజకీయ రంగప్రవేశం చేస్తానని పవన్ అధికారిక ప్రకటన చేసారో అప్పటి నుండి పవన్ ను తమలో కలుపుకోవడానికి కాంగ్రెస్ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే అసలు ఎవరి మీద విద్వేషాన్ని వ్యక్తపరిచి పవన్ ‘జనసేన’ ఏర్పాటు చేసారో, అదే పార్టీ ఇపుడు పవన్ కోసం తహతహలాడుతూ పవన్ పై తీవ్ర అభిమానం గుప్పించే వ్యాఖ్యలు చేస్తోంది.

అయితే కాంగ్రెస్ లో ఉన్న తన అన్నయ్య చిరంజీవి రాజకీయంగా ఎదురు వెళ్తున్నానని పవన్ పలు సందర్భాలలో ఇప్పటికే స్పష్టం చేసారు. మరి అలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ నాయకులు ‘జనసేన’ అధినేత కోసం విఫల యత్నాలు చేస్తుండడం విస్మయం కలిగించే అంశం. కాంగ్రెస్ పార్టీకి చరిష్మా ఉన్న నాయకుడు చిరు ఉన్నప్పటికీ, రాజకీయంగా చిరు పట్ల ప్రజల్లో ఏర్పడిన భావనతో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.

ADVERTISEMENT

ఈ కారణంతోనే పవన్ ను పడేసే క్రమంలో ఏకంగా పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయడానికైనా సిద్ధమంటూ కీలక వ్యాఖ్యలు చేస్తోంది. ఇదేదో ఒక్కసారికి పరిమితం కాలేదు, అవకాశం చిక్కినప్పుడల్లా పవన్ ను ఆకాశానికేత్తేయడం కాంగ్రెస్ నేతల వంతవుతోంది. పవన్ కాకుంటే జగన్ కైనా వల వేసేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతున్నట్లుగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

ADVERTISEMENT
Latest Stories