కరోనా ముందు వరుకు చూస్కుంటే ఐపీఎల్ లో మోస్ట్ కన్సిస్టెంట్ జట్టు ఏదనగా ఠక్కున వచ్చే బదులు ‘చెన్నై సూపర్ కింగ్స్’..! ముంబై జట్టు కూడా 5 ట్రోఫీలు నెగ్గినప్పటికీ, వారు ప్లే-ఆప్స్ ను అందటంతో చాలాసార్లు తడపడ్డారు. కానీ 2022 వరుకు చుస్తే ఏ ఒక్క ఐపీఎల్ ప్లే-ఆప్స్ ను మిస్ అవ్వలేదు చెన్నై సూపర్ కింగ్స్.
అప్పట్లో చెన్నై ఆధిపత్యం ఎలా ఉండేది అంటే ఐపీఎల్ లో పాల్గొనే ‘7 జట్లు తమలో తాము కొట్టుకుని, చివరికి చెన్నై తో ఫైనల్ లో ఎవరు తలపడతారు’ అనేలా ఉండేది సి.ఎస్.కె డామినెన్స్. కానీ, కరోనా తరువాత చూస్కుంటే చెన్నై జట్టు చతికిల పడిందనే చెప్పవచ్చు.
2023 లో ట్రోఫీ నెగ్గినప్పటికీ, మిగతా 3 సీజన్లు కనీసం ప్లే-ఆప్స్ ను కూడా చేరలేదు చెన్నై జట్టు. దీనితో తమిళ క్రికెట్ ప్రియులు తమ జట్టును ఇలా చూడలేకపోతుందని అనుకున్నారో ఏమో గాని చెన్నై యాజమాన్యం తమ వైఖరి కు పూర్తి విరుద్ధంగా 2026 కోసం జట్టును తయారు చేసుకున్నారు.
బ్యాన్ ఎత్తివేత పూర్తయిన 2018 ఐపీఎల్ ప్రారంభానికి మునుపు ప్రతి అభిమాని చెన్నై జట్టును ట్రోల్ చేసినవారే. వయసైపోయిన అంకుల్స్ అందరిని కట్టకట్టుకుని వచ్చి ఐపీఎల్ ఎలా గెలుస్తారు అంటూ వచ్చిన ప్రశ్నలకు ఆ ఏడు ఐపీఎల్ ట్రోఫీ తో నే బదులిచ్చింది చెన్నై జట్టు.
అలా 2018 నుండి నేటి వరుకు కూడా చెన్నై అంటే దాదాపు అందరు అభిమానుల నోటా వచ్చే మాట- ‘డాడీస్ ఆర్మీ’! వయసు పై బడిన రహానే, పుజారా, ఉతప్ప, డు-ప్లెసి, రాయుడు, వాట్సన్ వంటి వారు ఆ జట్టుకు ప్రముఖ ఆటగాళ్లుగా ఉన్న సీజన్లు లేకపోలేవు.
అయితే గత మూడేళ్లుగా సి.ఎస్.కె ఫెయిల్యూర్ కు ఈ సీనియర్ ప్లేయర్స్ నే కారణం అనలేకపోయినా, ఈ మూడేళ్లుగా యువ రక్తం చెన్నై జట్టులో ఒక మార్పు తీసుకొస్తోంది. సి.ఎస్.కె ఘోరంగా విఫలమయిన 2025 సీజన్లో, ఆయుష్ మరియు బ్రెవిస్ హాట్ టాపిక్ గా నిలిచారు.
అలానే 2026 ఐపీఎల్ కోసం నిర్వహించిన మినీ-ఆక్షన్ లో చెన్నై యాజమాన్యం దేశవాళీ టోర్నీలలో ప్రదర్శించిన ఆటగాళ్లకు కాసుల వర్షం కురిపించింది. దేశవాళీ లో అద్భుతంగా ప్రదర్శించిన ప్రశాంత్ మరియు కార్తీక్ కు తలా ఒక 14 కోట్లు వెచ్చించి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన అన్-క్యాప్డ్ ప్లేయర్స్ గా నిలిచారు.
వేలానికి ముందే సంజు శాంసన్ ను ట్రేడ్ రూపంలో జట్టులోకి తీసుకున్న చెన్నై జట్టు, వేలంలో యువకులను టార్గెట్ చేసి ‘డాడీస్ ఆర్మీ కాస్త బేబీస్ ఆర్మీ’ గా అవతరించింది. జట్టులోకి వచ్చిన యువకుల సాధనకు సీనియర్ల సామర్ధ్యం తోడై చెన్నై ను గత రెండేళ్లగా ఊరిస్తున్న ఐపీఎల్ ట్రోఫీ ను అందుకుంటుందేమో అని చూడాలి..!







