ఇటీవల ఈసీ ఏపీలో జగన్ ప్రభుత్వానికి, వైసీపి నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఇద్దరు జిల్లా కలెక్టర్లు, ఒక పోలీస్ ఐజీ స్థాయి ఉన్నతాధికారితో సహా మరో ఆరుగురుపై వేటు వేసింది. అయితే రాష్ట్రంలో అటువంటివారు ఐదారుగురు మాత్రమే కాదు డజన్ల కొద్దీ ఉన్నారని వారందరిపై కూడా వేటు వేయాల్సిందే అని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఓ లేఖ వ్రాశారు.
ఆమె జాబితాలో ఇన్‌చార్జి డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డితో సహా మొత్తం 22 మంది పేర్లు ఉన్నాయి! త్వరలో జరుగబోయే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే వైసీపి నేతలతో అంటకాగుతున్న పోలీస్ ఉన్నతాధికారులు అందరిపై వేటు వేయాల్సిందే అని ఆమె స్పష్టం చేశారు.
ఆమె కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాష్ట్ర అధ్యక్షురాలు. పైగా టిడిపి, జనసేనలతో బీజేపీ పొత్తు పెట్టుకొని ఎన్నికలలో పోటీ చేస్తోంది. కనుక ఆమె ఫిర్యాదుని ఈసీ పక్కన పెట్టలేదు. కనుక రాష్ట్ర డీజీపీతో సహా వారందరినీ ఈసీ పక్కన పెడితే అది జగన్ ప్రభుత్వానికి చెంపదెబ్బ అవుతుంది.
అంతేకాదు… ఎన్నికలలో అధికారులను, వారి ద్వారా దిగువ స్థాయి సిబ్బందిని అందరినీ ఉపయోగించుకొని ప్రతిపక్షాలను దెబ్బ తీసి ఎన్నికలలో గెలవాలనుకొంటున్న వైసీపికి పెద్ద ఎదురు దెబ్బ కూడా అవుతుంది కూడా.
దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర ఎన్నికల కమీషన్‌కు వ్రాసిన లేఖలో ఈ అధికారులందరికీ వైసీపి నేతలతో ఉన్న సంబంధాలతో సహా, వారు ఏవిదంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వైసీపికి తోడ్పడుతున్నారో కూడా వివరించి, వీరందరినీ ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కోరారు. ఆమె కేంద్ర ఎన్నికల కమీషన్‌కు వ్రాసిన ఎవరెవరున్నారంటే…
1. రాజేంద్రనాథ్ రెడ్డి: రాష్ట్ర డీజీపీ
2. విశాల్ గున్నీ: విశాఖ రేంజ్ డీఐజీ
3. పి.సీతారామాంజనేయులు: ఇంటెలిజెన్స్ డీజీ
4. పీవీ సునీల్ కుమార్: డీజీ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్)
5. సంజయ్: సీఐడీ అదనపు డీజీ
6. విజయారావు: డీఐజీ
7. పాల్ రాజ్: గుంటూరు రేంజ్ ఐజీ
8. అమ్మిరెడ్డి: డీఐజీ, అనంతపురం
9. రఘురామిరెడ్డి: ఐజీ (విజిలెన్స్)
10. సిద్దార్థ్ కౌశల్: ఎస్పీ కడప జిల్లా
11. జాషువా: ఎస్పీ, చిత్తూరు
12. రవిశంకర్‌రెడ్డి: ఎస్పీ, పల్నాడు జిల్లా
13. అన్బురాజన్: కర్నూలు ఎస్పీ
14. ఆనంద్ రెడ్డి: అనంతపురం ఎస్పీ, (నాన్ కేడర్)
15. రిషాంత్‌రెడ్డి: ఎస్పీ (కౌంటర్ ఇంటెలిజెన్స్)
16. ఫక్కీరప్ప: జాయింట్ సీపీ, విశాఖపట్నం
17. కెతిరుమలేశ్వరరెడ్డి: ఎస్పీ నెల్లూరు
18. జి.కృష్ణకాంత్: ఎస్పీ, కర్నూలు
19. రాధిక: ఎస్పీ, శ్రీకాకుళం
20. క్రాంతిరాణా: కమిషనర్ విజయవాడ
21. రఘువీరా రెడ్డి: ఎస్పీ, నంద్యాల
22. పరమేశ్వర్ రెడ్డి, ఎస్పీ ప్రకాశం




