సరికొత్త చరిత్రకు నాంది… వహ్వా..!

dangal-Overseas collectionsఎన్నడూ కనివిని ఎరుగని సినీ రికార్డులను 2017వ సంవత్సరంలో చవిచూస్తున్నాం. తొలి 1000 కోట్లు సాధించిన సినిమాగా ‘బాహుబలి 2’ ఓ అద్భుతమైన ఫీట్ అందుకుని అందరినీ అబ్బూర పరిచింది. అలాగే ఒక్క హిందీ మార్కెట్ లోనే 500 కోట్ల నెట్ వసూలు చేయడంతో పాటు మొత్తం ఇండియా వ్యాప్తంగా 1000 కోట్లు నెట్ వసూలు చేసిన చిత్రంగా కూడా నిలిచి ట్రేడ్ పండితులకు ఊహలకందని షాక్ ఇచ్చింది. ఇది క్లుప్తంగా ‘బాహుబలి 2’ విశ్వరూపం.

ADVERTISEMENT

అయితే ఇదే సమయంలో మరో పక్కన చైనా మార్కెట్ లో విడుదలైన “దంగల్” ఎవరూ అంచనాలు వేయలేనటువంటి ఫిగర్ ను అవలీలగా అందుకోబోతోంది. తొలి వారంలో 300 కోట్లు కలెక్షన్స్ వచ్చినపుడు… ఔరా అనుకున్నారు. ఆ తర్వాత అంతకంతకూ పెరుగుతూ పోతూ… ఇపుడు ఏకంగా 1000 కోట్ల మార్క్ కు చేరువ కావడం విశేషం. నేడో, రేపో ఆ ముచ్చట కూడా తీరిపోబోతోంది. ఓవర్సీస్ లో తొలి వెయ్యి కోట్లు వసూలు చేసిన చిత్రంగా సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది “దంగల్.”

ఈ ఒరవడి అక్కడ 1000 కోట్లతో ఆగేలా కనపడడం లేదు. ఇదే ఊపులో మరో రెండు వందల కోట్ల పై చిలుకు వసూలు చేస్తే… ప్రపంచ వ్యాప్తంగా 2000 కోట్లను అందుకున్న సినిమాగా “దంగల్” చిరస్థాయిగా నిలిచిపోనుంది. చైనాలో కనపడుతున్న ఊపు చూస్తుంటే… ఖచ్చితంగా ఈ ఫిగర్ అందుకునేలాగానే కనపడుతోంది. అయితే చైనాలో ఎన్ని కోట్లు కొల్లగొట్టినా, అవి పేరుకే తప్ప, నిజానికి ఆ మొత్తం కలెక్షన్స్ లో కేవలం 12.5 శాతం మాత్రమే నిర్మాతకు వస్తాయని ఇటీవల రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories