సరికొత్త చరిత్ర… 200 కోట్లు క్లబ్ లో చేరింది..!

dangal-sets-the-record-box-office-collections-200-croresమిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ బాలీవుడ్ చరిత్రను తిరగరాశాడు. ఇటీవల విడుదలైన ‘దంగల్’ సినిమా రికార్డు కలెక్షన్లు సాధిస్తూ… తాజాగా ఓవర్సీస్ లో 200 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిన తొలి సినిమాగా రికార్డు పుటలకెక్కింది. ఈ నెల 22 నాటికి విదేశీ మార్కెట్లో ‘దంగల్‌’ 200.65 కోట్ల రూపాయలు వసూలు చేసిందని బాలీవుడ్‌ ట్రేడ్‌ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. మరో వైపు దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘దంగల్’ రికార్డులను ఇప్పటికే సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా విడుదల నాటికి అమీర్ ఖాన్ అసహనం వ్యాఖ్యల కారణంగా సినిమాకు ఆదరణ లభించే అవకాశం లేదని, పలువురు అభిప్రాయపడగా, సినిమా బాగుంటే ఎలాంటి అడ్డంకులు ఉండవని, ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తారని చెప్పడానికి అమీర్ ‘దంగల్’ అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. కలెక్షన్లు నిలకడగా ఉండడంతో దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘దంగల్’ నిలవనుంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories