డియర్ కామ్రేడ్ అమెరికాలో ఫెంటాస్టిక్ ఓపెనింగ్

Dear-Comrade-Movie-Massive openings in USAవిజ‌య్ దేవ‌ర‌కొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా ఈరోజు నాలుగు భాషలలో విడుదల అయ్యింది. టాక్ ఆశాజనకంగా లేకపోయినా ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి. అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద 191 లొకేషన్ల నుండి 305,418 డాలర్లు రాబట్టింది. విజయ్ కేరీర్ లోనే ఇది రెండవ అత్యధిక ప్రీమియర్ కలెక్షన్. గతంలో ఆయన బ్లాక్ బస్టర్ చిత్రం, గీతగోవిందం దాదాపుగా 400,000 డాలర్ల మేర రాబట్టింది. ఒక కొత్త డైరెక్టర్ తో 305,418 డాలర్లు అంటే మాములు విషయం కాదు.

ADVERTISEMENT

అయితే సినిమా రివ్యూలు బాగోలేకపోవడంతో ఇక్కడ నుండి ఎలా పెర్ఫర్మ్ చేస్తుందో చూడాలి. ఇక్కడి బాక్స్ ఆఫీస్ వద్ద పరిస్థితిలు కూడా దాదాపుగా అలాగే ఉన్నాయి. అన్ని చోట్లా ఓపెనింగ్స్ అదిరిపోయాయి. వారాంతంవరకూ బాగానే ఉండొచ్చని ట్రేడ్ భావిస్తుంది. డియర్ కామ్రేడ్ విడుదలకు ముందు ప్రపంచవ్యాప్తంగా 33 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ టాక్ తో ఆ మొత్తం రాబట్టాలంటే అది తేలికైన విషయం కాదు. ఓపెనింగ్స్ వల్ల ఫుల్ రన్ లో యావరేజ్ అవొచ్చని ట్రేడ్ అంచనా.

ఒకప్పుడు సక్సెస్ కు చిరునామాగా ఉండే మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. గత కొంత కాలంగా ఆ నిర్మాణ సంస్థను పరాజయాలు పలకరిస్తున్నాయి. దీనితో ఆ సంస్థ కూడా ఈ సినిమా మీద చాలానే ఆశలు పెట్టుకుంది. అయితే ఇప్పుడు విజయం కోసం తమ తదుపరి చిత్రం గ్యాంగ్ లీడర్ కోసం వేచి చూడాల్సిందే. ఈ చిత్రం తరువాత విజ‌య్ దేవ‌ర‌కొండకు హీరో అనే ఒక సినిమా, క్రాంతి మాధవ్ తో ఇంకా పేరు పెట్టని ఒక సినిమా ఉన్నాయి.

ADVERTISEMENT
Latest Stories