ఇది ట్రైలర్ సక్సెస్ సెలబ్రేషన్స్ గురూ!

Deepika Padukone Private Party with Padmavati Teamసంజ‌య్‌లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ‘ప‌ద్మావ‌తి’ చిత్ర ట్రైల‌ర్‌ సోష‌ల్ మీడియాలో 50 మిలియ‌న్ల‌కి పైగా వీక్ష‌ణ‌లు సంపాదించి విజ‌యవంత‌మైనందుకు న‌టి దీపికా ప‌దుకునే చాలా ఆనందం వ్య‌క్తం చేస్తోంది. ఈ ఆనందాన్ని స‌హా బాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో పంచుకోవ‌డానికి శ‌నివారం సాయంత్రం ఓ పెద్ద పార్టీ కూడా ఇవ్వ‌నున్న‌ట్లు బాలీవుడ్ మీడియా వెల్ల‌డించింది.

ADVERTISEMENT

ముంబైలోని త‌న ఇంట్లో దీపికా ఈ పార్టీ ఇవ్వ‌నుంది. ఈ పార్టీకి ప‌ద్మావ‌తి న‌టులు ర‌ణ్‌వీర్ సింగ్‌, షాహిద్ క‌పూర్‌, ద‌ర్శ‌కుడు సంజ‌య్‌లీలా భ‌న్సాలీల‌తో పాటు షారుక్ ఖాన్‌, గౌరీ ఖాన్‌, క‌ర‌ణ్ జొహార్‌, ఆలియా భ‌ట్‌, సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, ఆదిత్యరాయ్ క‌పూర్‌, నిర్మాత క‌పిల్ చోప్రా, ద‌ర్శ‌కుడు అభ‌య్ చోప్రాలు హాజ‌రుకానున్నారు. ట్రైల‌ర్ త‌ర్వాత విడుద‌లైన ప‌ద్మావ‌తి పాట ‘ఘూమ‌ర్‌’కి కూడా సోష‌ల్ మీడియాలో చాలా వీక్ష‌ణ‌లు వ‌స్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories