కార్తీ హీరోగా నటించిన “దేవ్” సినిమా ఫస్ట్ టీజర్ విడుదలైంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను రజత్ రవిశంకర్ దర్శకత్వం వహించగా, హారిస్ జయరాజ్ సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ ను అందించాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ – హీరో కార్తీల నడుమ రొమాంటిక్ సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి.
ఈ ఇద్దరి జంటను సినీ ప్రేక్షకులు చూడడం ఇదే మొదటిసారి కాదు. గతంలో “ఖాకీ” సినిమాలో కూడా కనువిందు చేసిన ఈ జంట, ఆ సినిమాలో హాట్ అండ్ రొమాంటిక్ సాంగ్స్ లలో కనిపించి, టాక్ ఆఫ్ టౌన్ అయ్యారు. మళ్ళీ అదే రొమాంటిక్ సన్నివేశాలను ఈ “దేవ్”లో రిపీట్ చేయడం చెప్పుకోదగ్గ విషయం. వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉండడం ఈ “దేవ్”కు ప్లస్ పాయింట్.
ADVERTISEMENT
[m9adh]
ADVERTISEMENT



