పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ ఆ మెగా హీరో దగ్గరకు వెళ్లిందా?

An Unstoppable And Buoyed Sai Dharam Tej Goes Ahead With His Nextమెగా హీరో సాయి తేజ్ కొత్త సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ‘ప్రస్థానం’ తో తెలుగు చిత్రసీమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దేవకట్టాతో సాయి తేజ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం ముహూర్తం ఫిలింనగర్ టెంపుల్ లో జరిగింది. పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టారు.

దేవ కట్టాతో వస్తోన్న ఈ సినిమా ఆయన శైలిలోనే ఇంటెన్స్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కబోతోందట. ఈ చిత్రం గురించి మరో ఆసక్తికరమైన విషయం ఫిలింనగర్ లో వినిపిస్తుంది. ఈ స్క్రిప్ట్ దేవ కట్టా పవన్ కళ్యాణ్ కోసం తయారు చేశాడట. రెండున్నర ఏళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ కు వినిపించాడట.

ADVERTISEMENT

పవన్ కళ్యాణ్ కి నచ్చినా జనసేన పనులలో బిజీ అయిపోయి చెయ్యడం కుదర్లేదట. ఇప్పుడు చేద్దామన్నా టైం లేదట. దీనితో ఆ స్క్రిప్ట్ సాయి ధరమ్ తేజ్ దగ్గరకు పంపించాడని సమాచారం. ఇక సాయి ధరమ్ తేజ్ విషయానికి వస్తే… కెరీర్ మొదట్లో మంచి హిట్లు వచ్చినప్పటికీ ఆ తర్వాత చాలా సినిమాలు ప్లాప్ అవుతూ వచ్చాయి.

ఏకాంగా డబల్ హైట్రిక్ ప్లాపులు రావడంతో ఇక తన పని అయిపోయింది అనుకున్నారు అంతా. ఈ తరుణంలో చిత్రలహరి అనే యావరేజ్, ప్రతిరోజు పండగే వంటి సూపర్ హిట్ తో మళ్ళీ తన సత్తా చాటాడు ఈ యువ హీరో. ప్రస్తుతం మే 1న విడుదల కాబోయే సోలో బ్రతుకే సో బెటర్ సినిమాపై కూడా ట్రేడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి. సాయి ధరమ్ తేజ్ కేరీర్ నిలదొక్కుకుంటుంది అనే సమయంలో ఇటువంటి చిత్రం చెయ్యడం రిస్క్ అనే చెప్పుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories