“ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ” అంటోన్న దేవదాస్!

DevaDas Movie Trailer Talkనాగ్ – నానిలు కలిసి నటించిన “దేవదాస్” సినిమా ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల మన్ననలను పొందుతోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా గురువారం రాత్రి విడుదల చేసిన ఈ ట్రైలర్ కు యూ ట్యూబ్ లో 1 మిలియన్ క్లిక్స్ అందుకుంది. మల్టీస్టారర్ సినిమాలను ఆస్వాదించాలనుకునే వారికి కన్నులవిందుగా ఈ సినిమా రూపొందిందన్న నమ్మకాన్ని ఈ ట్రైలర్ కలిగించింది.

ADVERTISEMENT

[m9ad]

ఇద్దరూ వారి వారి సహజసిద్ధమైన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే విషయాన్ని ఆడియో లాంచ్ లో కింగ్ నాగ్ కూడా స్పష్టం చేసారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. హీరోయిన్లుగా రష్మిక, ఆకాంక్షలు నటిస్తుండగా, వైజయంతీ మూవీస్ పై అశ్వనీదత్ ఈ సినిమాను నిర్మించారు.

ADVERTISEMENT
Latest Stories