ధోని ‘మ్యాచ్ ఫిక్సర్’ కాదు! దేవ్ ప్రకటన!

dhoni-is-not-match-fixer-says-sunil-devటీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 2014లో ఇంగ్లాండ్ లో జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్ ను ఫిక్స్ చేసారంటూ అప్పటి జట్టు మేనేజర్ సునీల్ దేవ్ ఓ ప్రముఖ హిందీ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారంటూ వెలువడిన కధనాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారి, పెద్ద ఎత్తున చర్చలకు దారితీసాయి. తానూ చేసినట్లుగా వచ్చిన ఈ ఆరోపణలపై స్పందించిన సునీల్ దేవ్, సదరు దినపత్రికపై మండిపడ్డారు.

“ఇదంతా పూర్తి అవాస్తవం. ధోని మ్యాచ్ ఫిక్స్ చేసాడంటూ నేను ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఆ హిందీ పత్రికపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటా, అవసరమైతే పరువు నష్టం దావా వేస్తాను” అని సునీల్ దేవ్ తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానించారు. దేవ్ వ్యాఖ్యలతో భారత క్రికెట్ రంగం ఊపిరి పీల్చుకుంది. అలాగే ధోని అభిమానులు కూడా స్థిమితపడ్డారు. మరి దేవ్ చెబుతున్న వ్యాఖ్యలు నిజమైతే సదరు పత్రిక ఉద్దేశం ఏమిటోనన్న ఆలోచనలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories