మహేష్ బాబును మళ్ళీ దాచేసారా?

మహేష్ బాబును మళ్ళీ దాచేసారా?స్టార్ హీరోగా మహేష్ బాబుని సిల్వర్ స్క్రీన్ పై ఎన్నో సార్లు చూసిన అభిమానులకు ఇటీవల స్మాల్ స్క్రీన్ పై జూనియర్ ఎన్టీఆర్ తో ప్రసారమైన “ఎవరు మీలో కోటీశ్వరులు” ఎపిసోడ్ ఎంతో కిక్ ని ఇచ్చింది. దీంతో త్వరలో ‘ఆహా’లో బాలకృష్ణతో ప్రదర్శితం అయ్యే ఎపిసోడ్ ఎప్పుడు ఉంటుందోనని నిరీక్షించడం సూపర్ స్టార్ అభిమానుల వంతయ్యింది.

తొలుత లభించిన సమాచారం మేరకు ఈ నెల 17వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారం కావొచ్చు అన్న టాక్ వినపడింది. కానీ లేటెస్ట్ గా ‘ఆహా’ విడుదల చేసిన రాజమౌళి ‘అన్ స్టాపబుల్’ ప్రోమోతో మహేష్ బాబుని మళ్ళీ దాచిపెట్టేశారని స్పష్టమవుతోంది. ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ విషయంలో కూడా ఇలాగే జరిగిందన్న విషయాన్ని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ సందర్భంగా నెమరు వేసుకుంటున్నారు.

ADVERTISEMENT

జూనియర్ ఎన్టీఆర్ తో పాల్గొన్న ఎపిసోడ్ షూటింగ్ చాలా కాలమే క్రితమే షూట్ చేసినప్పటికీ, దాదాపుగా ఓ రెండు నెలలు దాచిపెట్టి, ఈ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ గా ప్రసారం చేసారు. తాజాగా ‘ఆహా’ కూడా ఇదే రూట్ లో పయనించబోతోందా? అన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. బహుశా జనవరి 1 లేక సంక్రాంతికి సూపర్ స్టార్ ఓటీటీ ఆగమనం ఉండొచ్చన్న టాక్ లేటెస్ట్ గా వినపడుతోంది.

ఈ వారం మహేష్ ఎపిసోడ్ మిస్సయినా, రాజమౌళి ఎపిసోడ్ కావాల్సినంత కిక్ పంచుతుందన్న విషయం ప్రోమోలో తెలిసిపోయింది. ముఖ్యంగా మీతో సినిమా చేసి బ్లాక్ బస్టర్ అయిన తర్వాత రెండు, మూడు సినిమాలు ‘ఫసక్’ అంటగా అన్న బాలకృష్ణ ప్రశ్నకు – రాజమౌళి హావభావాలు తోడై ఈ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచాయి. రాజమౌళి ఎపిసోడ్ అంటే ప్రోమో ఈ రేంజ్ లో ఉండాలి కదా!

ADVERTISEMENT
Latest Stories