“ఏ నిర్మాత అయినా సాధారణంగా సినిమాలను డబ్బుల కోసమే తీస్తామని, తానూ కూడా అలాగే నిర్మిస్తానని, అయితే పివిపి మాత్రం ఒక ఫ్యాషన్ తో సినిమాలను నిర్మిస్తారని, అందుకు సాక్ష్యాలే సైజ్ జీరో, క్షణం, ఊపిరి సినిమాలు అని” ప్రముఖ నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చారు.
“80వ దశకం నాటి హీరోలలో 50 కోట్ల క్లబ్ లో చేరిన తొలి హీరో నాగార్జున అని, అప్పుడు ‘శివ’ సినిమాతో ఒక ట్రెండ్ సృష్టించి తెలుగు సినిమా గమనాన్ని తిప్పగా, ఇప్పుడు వరుసగా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ మరో ట్రెండ్ సృష్టిస్తున్నారని, ‘ఊపిరి’ సినిమా మరో ట్రెండ్ సెట్టింగ్ సినిమా అవుతుందన్న నమ్మకం ఉందని, టాలెంట్ ఎక్కడ ఉంటే, వాళ్ళని పైకి లాగడం నాగ్ వంతవుతోందని” కింగ్ పై ప్రశంసలు కురిపించారు దిల్ రాజు.
“మున్నా, బృందావనం, ఎవడు సినిమాలు తీసిన దర్శకుడు మా వంశీ పైడిపల్లి గురించి తనకు తెలుసని, క్వాలిటీ విషయంలో రాజీపడరని, టీజర్స్ చూస్తుంటే ఆ క్వాలిటీ కనపడుతోందని, దర్శకుడిగా వంశీ పైడిపల్లి మరో మెట్టు ఎదిగే విధంగా ఊపిరి నిలుస్తుందన్న” అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్.



