దిల్ రాజుతో చేతులు కలిపిన క్రిష్

Dil Raju - Director Krish Movie launchedసీనియర్ నిర్మాత దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్‌లో ఒక సరికొత్త సినిమా రానుంది. అయితే క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం లేదు. ఆయన నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు అనే ఈ సినిమాకు సహా నిర్మాత. శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, డైరెక్ట‌ర్ క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు` చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రాచ‌కొండ విద్యాసాగ‌ర్ అనే కొత్త దర్శకుడిని ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో అవ‌స‌రాల శ్రీనివాస్, రుహ‌నీ శ‌ర్మ(చి.ల‌.సౌ ఫేమ్‌) హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. రామ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు స్వీకార్ అగ‌స్తి సంగీతాన్ని అందిస్తున్నారు.

ADVERTISEMENT

ఈరోజు సినిమా ముహూర్తం జరుపుకుంది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ఇత‌ర వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నుంది. క్రిష్ ఈ ఏడాది ఇప్పటికే రెండు ప్లాపులు ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు) ఇచ్చాడు. అలాగే ఆయన దర్శకత్వం వహించిన బాలీవుడ్ చిత్రం మణికర్ణిక విషయంలో కూడా అనేక వివాదాలలో ఇరుక్కున్నాడు.

ఇంకా తన తదుపరి చిత్రం కసరత్తులోనే బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ ప్రాజెక్టుకు ఆయన దర్శకత్వం వహిస్తాడని వార్తలు వస్తున్నాయి. అది బాలీవుడ్ సినిమా పింక్ రీమేక్ అని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు దాని మీద ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు.

ADVERTISEMENT
Latest Stories