దిల్ రాజుకి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి

Dil Raju Faces New Trouble With Toxic Release

2025 సంక్రాంతి నుండి దిల్ రాజు టైమ్ బాలేదేమో అనిపిస్తోంది. “గేమ్ ఛేంజర్” లాంటి డిజాస్టర్ తర్వాత “తమ్ముడు”తో మరో ఫ్లాప్ చవిచూశాడు దిల్ రాజు. తర్వాత ఎన్ఆర్ఏ లో కొన్న “గాయపడ్డ సింహం” లాంటి సినిమాలు కూడా వర్కవుట్ అవ్వలేదు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, ఎగ్జిబిటర్ గా చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు.

ఇప్పుడు “టాక్సిక్” విషయంలోనూ ఇంచుమించుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. టాక్సిక్ తెలుగు రైట్స్ ను దిల్ రాజు భారీ మొత్తం చెల్లించి కొన్నాడు. 120 కోట్లు అని ప్రమోట్ చేస్తున్నప్పటికీ 70 లోపు అని సమాచారం. ఇప్పుడు ఆ సినిమాని సంతోషంగా రిలీజ్ చేసుకునే పరిస్థితి లేకపోవడం దిల్ రాజు నెత్తిన బండ పడ్డట్లు అయ్యింది.

ADVERTISEMENT

రవితేజకి రాకరాక 5 ఏళ్ల తర్వాత “ఇరుముడి”తో మంచి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. మంచి ఫుట్ ఫాల్స్ & కలెక్షన్స్ తో సినిమా దూసుకుపోతోంది. ఓవర్సీస్ లోనూ రవితేజకి మొట్టమొదటి 1 మిలియన్ కలెక్షన్స్ సాధించిపెట్టిన సినిమా ఇరుముడి. ఇదే హవా కొనసాగితే “ఇరుముడి” 100 కోట్ల షేర్ సినిమాగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాల అంచనా.

అయితే.. దిల్ రాజు “టాక్సిక్” సినిమాని 26 (బుధవారం) థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాడు. నైజాంలో దాదాపుగా మెయిన్ థియేటర్స్ అన్నీ టాక్సిక్ ప్లే చేస్తాయి. నిజానికి ఇది అన్నీ సినిమాలకు జరిగే సినారియోనే. కాకపోతే.. టాక్సిక్ అనేది డబ్బింగ్ సినిమా కావడం, ఆల్రెడీ రవితేజ లాంటి స్టార్ సినిమా మంచి టాక్ తో నడుస్తుండడంతో.. ట్రేడ్ వర్గాల నుండి, ఆడియన్స్ నుండి “ఇప్పుడు ఈ డబ్బింగ్ సినిమాని ఇన్ని థియేటర్లలో రిలీజ్ చేయడం అవసరమా?” అనే ప్రశ్న తలెత్తింది.

ఇక్కడ చిక్కు ఏంటంటే.. బుధవారం నుండి ఇరుముడికి థియేటర్లు తగ్గి “టాక్సిక్”కి ఎక్కువ థియేటర్లలో లభ్యం అవ్వడం కామన్. అయితే.. టాక్సిక్ హిట్ అయ్యి థియేటర్లు హోల్డ్ చేస్తే పర్లేదు కానీ, సినిమాకి నెగిటివ్ టాక్ లేదా యావరేజ్ టాక్ వచ్చి.. థియేటర్లకు జనాలు రాకపోయినా, థియేటర్లు ఖాళీగా ఉన్నా హోల్డ్ చేస్తే మాత్రం దిల్ రాజు రవితేజ ఫ్యాన్స్ & ఇండస్ట్రీ వర్గాలు తిట్టుకోవడం ఖాయం.

టాక్సిక్ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ & రిజల్ట్ వస్తే పర్లేదు కానీ.. ఏమాత్రం అటు ఇటు అయినా దిల్ రాజు పరిస్థితి సోషల్ మీడియాలో చాలా ఘోరంగా ఉంటుంది. మరి దీన్ని దిల్ రాజు ఎలా మ్యానేజ్ చేస్తాడు? థియేటర్లు ఎలా మ్యానేజ్ చేస్తాడు? అనేది చూడాలి.

ఇదంతా.. మైత్రీ సంస్థకు మాత్రం మంచి ప్లస్ అవుతోంది. ఆల్రెడీ మార్కెట్ లో ఉన్న దిల్ రాజు వర్సెస్ మైత్రి అనే నెరేటివ్ కి ఈ ఇరుముడి వర్సెస్ టాక్సిక్ థియేటర్స్ ఇష్యూ మరింత ఆజ్యం పోస్తుంది.

ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో “రౌడీ జనార్ధన” తప్ప మరో చెప్పుకోదగ్గ సినిమా కూడా లేదు. ఆ సినిమా ఎప్పుడు వస్తుంది అనే క్లారిటీ కూడా లేదు. ఈ టఫ్ పీరియడ్ నుండి దిల్ రాజు ఎలా బయటపడి, మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంపాదించుకోగలడా? అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories