యువ దర్శకులలో మినిమం గ్యారంటీ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇప్పటివరకూ తన కేరీర్ లో ప్లాప్ అనేది లేదు. పైగా ఆయా సినిమాలు ఆ హీరోల కేరీర్లో అతిపెద్ద హిట్లు అవుతూ వస్తున్నాయి. ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు తో స్టార్ హీరో అవతారమెత్తిన ఈ డైరెక్టర్ ఇప్పుడు ఎఫ్2 సీక్వెల్ ఎఫ్3 కోసం పని చేస్తున్నాడు.
అయితే ఈలోగా మరో ప్రాజెక్ట్.. గాలి సంపత్ కు స్క్రీన్ ప్లే రైటర్ గా ప్రెజెంటర్ గా కూడా అవతారమెత్తాడు అనిల్. అయితే తాజాగా ఈ సినిమాకు డైరెక్షన్ సూపర్ విజన్ కూడా చేస్తున్నట్టు అనిల్ ప్రకటించాడు. సినిమాపై ఎంతో నమ్మకం ఉందని, టీం వర్క్ ఎప్పుడూ ది బెస్ట్ గా ఉంటుందని నమ్మే వ్యక్తిగా మరిన్ని బాధ్యతలు తీసుకున్నట్లు అనిల్ రావిపూడి ప్రకటించారు.
దానితో ఈ సినిమాకు మరింత హైప్ వచ్చే అవకాశం ఉంది. శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యింది. ఈ సినిమా వేసవిలో రిలీజ్ కానుంది. ఇందులో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ విష్ణు, రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలు తండ్రీ కొడుకులుగా కనిపించనున్నారు.
ఇక్కడ విశేషం ఏమిటంటే… టైటిల్ పాత్ర రాజేంద్ర ప్రసాద్ దే అంటున్నారు. అనిల్ వద్ద కో-డైరెక్టర్‌గా, రచయితగా పనిచేసిన ఆయన మిత్రుడు ఎస్. క్రిష్ణ ఇమేజ్ స్పార్క్ ఎంటర్‌టైన్మెంట్ అనే బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్ సంస్థతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీ విష్ణు సరసన లవ్‌లీ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.





