ప్రేక్షకులు మారాలా..ఇదేం లాజిక్ హనూ?

Director Hanu Raghavapudi asked audience to changeటాలీవుడ్ దర్శకులు హను రాఘవపూడి ఒక ప్రఖ్యాత ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పడి పడి లేచే మనసు విషయమై..ప్రేక్షకుడు ఆలోచనా పద్దతి మారాలి అని… దర్శకుడు ఏం చూపించాలి అని అనుకుంటాడో అదే చూపిస్తాడు కానీ…వాళ్ళు ఊహించు కున్నది ఎలా చూపిస్తాడు అంటూ ప్రేక్షకుడిపైనే సెటైర్స్ వేసాడు.

[m9ad]

ADVERTISEMENT

నిజమే కరెక్టే..దర్శకుడు తనకు నచ్చిందే చూపిస్తాడు…అందులో ఏమాత్రం డౌట్ లేదు..కానీ దర్శకుడు చూపించేదే ప్రేక్షకుడి కోసం కదా…మరి అలాంటి సమయంలో ప్రేక్షకుడు ఏం ఆశిస్తాడో అది చూపించడం దర్శకుడి యొక్క టాలెంట్ అవ్వాలి కదా..మరి ఈ విషయంలో దర్శకులు అప్డేట్ అవ్వాలి అన్న చిన్న లాజిక్ మర్చిపోతే ఎలా హను గారు…

పైగా ప్రేక్షకుడిపైనే సెటైర్స్ వేస్తున్నారు!..మీరు తీసిన పడి పడి లేచే మనసు సినిమా సెకండ్ హాఫ్ బోరింగ్ గా..ప్రేక్షకుడికి కనెక్ట్ కానీ విధంగా ఉంది..ఈ క్రమంలో మీరు ఆ పద్దతి మార్చుకుని ప్రేక్షకుడి అభిరుచికి తగ్గట్టు సినిమా తీస్తే ఖచ్చితంగా మంచి హిట్స్ వస్తాయి..అని స్పష్టంగా చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories