డైలమాలో దర్శకుడు..ఆ హీరో ఛాన్స్ ఇస్తాడా?

director hanu raghavapudi in dilemaఒక్క సినిమా హిట్ అయితే చాలు వరుస ఆఫర్స్ తో ఉక్కిరిబిక్కిరి చేసేస్తారు ఇండస్ట్రీ వాళ్ళు. అయితే అదే ఒక సినిమా పోయింది అంటే ఇక ఆ దర్శకుడు పని అయిపొయింది అనే కథ ఇండస్ట్రీ మొత్తం హల్చల్ చేసేస్తుంది.

[m9ad]

ADVERTISEMENT

ఇప్పుడు దర్శకుడు హను రాఘవపూడి పరిస్థితి అదే..పాపం లై సినిమాతో ప్లాప్ ను మూటగట్టుకున్నఈ దర్శకుడు ఆతర్వాత వెంటనే వచ్చిన పడి పడి లేచే మనసు సినిమాతో మరో డిజాస్టర్ ను చవి చూసాడు.అయితే ఈ వరుస ప్లాప్స్ తో ఫార్మ్ కోల్పోయిన ఈ దర్శకుడికి ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని ఛాన్స్ ఇస్తాడో లేదో అన్న డైలామా నెలకొంది.

అసలైతే నాని జెర్సీ తర్వాత హనుతో ఒక సినిమా చేసేందుకు గతంలో కథా చర్చలు జరిగాయి. కానీ హను పరిస్థితి చూస్తే నాని నో అంటాడేమో అన్న అనుమానం నెలకొంది.

జెర్సీ సినిమా తర్వాత వెంటనే విక్రమ్ కుమార్ తో నాని సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి…మరో పక్క హను ఏమో…తన తర్వాత సినిమా నానితోనే అని కంకణం కట్టుకు కూర్చున్నాడు. మరి నాని ఒకే చెప్తాడా? లేక హను ని లైట్ తీసుకుంటాడా? అన్నది వేచి చూడాల్సిన విషయమే.

ADVERTISEMENT
Latest Stories