కొరటాల కూడా హ్యాండ్ ఇచ్చాడు…. దేవికి కష్టకాలం…!

Music Director Devi Sri Prasad - Director Koratala Sivaటాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మధ్య కాలంలో కష్టాల్లో పడ్డాడు. ఫామ్ కోల్పోయిన దేవికి అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా కొరటాల శివ కూడా దేవిని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. కొరటాల ఇప్పటివరకూ దర్శకత్వం వహిస్తున్న అన్ని సినిమాలకు దేవినే మ్యూజిక్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఆయన దేవిని కాదనుకున్నట్టు సమాచారం.

ADVERTISEMENT

ఎవరైనా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ను ఈ సినిమా కోసం తీసుకుని రావాలని ప్రయత్నిస్తున్నారని సమాచారం. చిరంజీవి హిస్టారికల్ సినిమా, సైరా సినిమాకు కూడా ఇద్దరు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేస్తున్నారు. అయితే చిరంజీవి – కొరటాల సినిమా సంగతి ఎలా ఉన్నా, ఇది దేవికి మాత్రం పెద్ద నష్టమనే చెప్పుకోవాలి.

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మాత్రమే దేవి చేతిలో ఉన్న పెద్ద సినిమా. ఆ సినిమాకు మంచి ఆల్బం ఇవ్వకపోతే మాత్రం కష్టమే. చిరంజీవి – కొరటాల సినిమా నవంబర్ లో మొదలయ్యే అవకాశం ఉంది. ఇక కథ విషయానికి వస్తే…. ఈ సినిమా స్టోరీకి నక్సల్ బ్యాక్ డ్రాప్ ఉంటుందని సమాచారం. ఈ చిత్ర మేజర్ గా శ్రీకాకుళం జిల్లా పలాసలో జరుగనుందని తెలుస్తుంది.

చిరంజీవి సినిమాను తనయుడు రామ్ చరణ్ నిర్మించనున్నాడు. ఈ సినిమాను ఉగాది సంద‌ర్భంగా విడుద‌ల కానుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అనేక పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ ఎవరిని అధికారికంగా ధ్రువీకరించలేదు

ADVERTISEMENT
Latest Stories