చెత్త కుప్పల్లో కధలు…కరువైన హీరోలు!

Director Krish about the different genre filmsమంచి టాలెంట్ ఉన్న దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడి ఒకరు అని ప్రత్యేకంగా చెప్ప్పాల్సిన పనిలేదు. అయితే ఈ క్రమంలో క్రిష్ అటు దర్శకుడు గానే కాకుండా ఇటు నిర్మాతగా కూడా సినిమాలు తీస్తున్నాడు. ఇక తాను నిర్మాతగా మారి తెరకెక్కించిన ‘అంతరిక్షం’ సినిమా ట్రైలర్ నిన్న విడుదలయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ లాంచ్ సమయంలో క్రిష్ మాట్లాడుతూ ఒక నిజం చెప్పాడు. అవును క్రిష్ నిజమే చెప్పాడు. సినిమా రంగంలో ముఖ్యంగా తెలుగు సినిమా రంగంలో కధలు చాలానే ఉన్నాయి అని. అయితే కానీ ఆ సినిమాలను టేక్ అప్ చేసే హీరోలే లేరు అని. ప్రతీ ఒక్కరూ కమర్షియల్ కధలతోనే సినిమా తీయాలి అని చూస్తున్నారే తప్పా, అంతరిక్షం లాంటి సినిమాలు తీయడానికి ఎవ్వరూ సాహసించడంలేదు.

[m9ad]

ADVERTISEMENT

అయితే ఒక బడా హీరో ఇలాంటి సినిమా చేస్తేనే ఆ సినిమా భారీ హిట్ అవ్వడమే కాకుండా, ఇలాంటి కధలు చాలానే ప్రాణం పోసుకునే అవకాశం ఉంటుంది అని దర్శకుడు క్రిష్ చెబుతూ ఉన్నాడు. ఎన్నో వైవిధ్యమైన కధలు చెత్త బుట్టల్లో పడి ఉన్నాయి అని, నిర్మాతలు, దర్శకులు చాలా మందే ఉన్నారు అని, కానీ ఆ సినిమాలను ఒప్పుకుని చేసే బడా హీరోలు కరువయ్యారు అంటూ క్రిష్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. నిజమే క్రిష్ చెప్పింది నూటికి నూరు శాతం నిజమే.

హ్యాలీవడ్ లాంటి ఇండస్ట్రీలో కధ, కధనానికి ఉండే విలువ హీరోలకు భజన చేయడంలో ఉండదు. బహుశా ఆ భజన వల్లనే మన తెలుగు సినిమాలు అన్నీ మూస కధలకే పరిమితం అవుతున్నాయి అని చెప్పవచ్చు. ఇక వరుణ్ లాంటి టాప్ హీరోలు ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేస్తేనే కధలు బ్రతుకుతాయి, కొత్త కధలు పుట్టుకు వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమ తీరు పూర్తిగా మారిపోతుంది. అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటి అంటే, తెలుగు సినిమాల్లో హిట్ ట్ర్యాక్ ఉంటేనే అవకాశాలు లభిస్తాయి. అందుకే హీరోలు కూడా కమర్షియల్ అనే చట్రంలో ఉండి పోయి సినిమాలు చేస్తారు. కానీ హాలీవుడ్ అలా కాదు, కొత్తగా ఏం కనిపెట్టాం…సరికొత్తగా ఏం చేద్దాం అని మాత్రమే ఆలోచిస్తారు తప్పా, కమర్షియల్ చట్రంలో కొట్టు మిట్టాడరు. బహుశా అందుకే అక్కడ అద్భుతాలు పుట్టుకొస్తున్నాయి. ఇక అవే ‘పాత’ కధలతో సినిమాలు వచ్చి…’పోతు’…న్నాయి.–

ADVERTISEMENT
Latest Stories