‘అంతరిక్షం’ నుంచి ‘అంటార్కిటికా’నా?

director sankalp reddy next based on Antarcticaయువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఘాజితో టాలీవుడ్ ను కొత్త దారులు తొక్కించాడు. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని వరుణ్ తేజ్ హీరోగా అంతరిక్షాన్ని మన ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేసాడు. కట్ చేస్తే ఘజిలా దూసుకుపోయినప్పటికీ, ‘అంతరిక్షం’లోకి వచ్చే సమయానికి మ్యాటర్ తేడా కొట్టేసింది.

సరే ఈ కథ అంతా పక్కన పెట్టి అసలు తాను తీయబోయే మూడో సినిమా ఎలా ఉండబోతుందో అంటే, మొన్నటివరకూ వినిపించిన కధనం ప్రకారం సంకల్ప్ ఏదో కొత్త కధతోనే మన ముందుకు వస్తాడు అని అనుకున్న తరుణంలో టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న కధనం ప్రకారం సంకల్ప్ తన కొత్త సినిమాను అంటార్కిటికా రీసెర్చ్ స్టేషన్ ఆధారంగా, హీరో ఆ రీసెర్చ్ స్టేషన్ లో జాయిన్ అయ్యిన సమయం నుంచి కథ మొదలు పెట్టి, అక్కడ ఎదురైనా సవాళ్ళను చూపించే విధంగా సినిమా కథ ఉండబోతుంది అంటూ గాసిప్స్ చక్కెర్లు కొడుతున్నాయి.

ADVERTISEMENT

మరి ఇప్పటివరకూ సంకల్ప్ నుంచి ఎటువంటి వార్తా రాలేదు కానీ, మొత్తంగా చూస్తే మాత్రం సంకల్ప్ మాత్రం ఇలాంటి సరికొత్త కధతోనే వస్తాడు అని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories