ఆ విషయంలో జాగ్రత్త పడాల్సిందేగా!

Director Sankalp Reddy responds to critics on Antariksham 9000 KMPHసినిమా అంటేనే కల్పితం..కాదని అనలేం. అయితే ఈ క్రమంలో సైన్స్ కి సంభందించిన సినిమాల లెక్కే తీసుకుంటే ఆ సినిమాల్లో లాజిక్స్ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. ఆ విషయంలో ఏమాత్రం తగ్గకూడదు…

[m9ad]

ADVERTISEMENT

అయితే అంతరిక్షం సినిమాలో లాజిక్స్ పై క్రిటిక్స్ తమదైన శైలిలో స్పందిస్తే దానిపై దర్శకుడు సంకల్ప్ రెడ్డి మాట్లాడుతూ ఈ సినిమాలో లాజిక్స్ లేవంటూ చాల మంది క్రిటిక్స్ క్రిటిసైజ్ చేస్తున్నారు..ఈ సినిమాలో లాజిక్స్ వెతికితే సినిమా కాస్త డాక్యూమెంటరీ అయిపోతుంది అంటున్నాడు.

బాగానే ఉంది కానీ సంకల్ప్ గారు…ఇక్కడ అసలు చిక్కు ఏంటి అంటే మీరు తీసిందే సైంటిఫక్ సినిమా…పైగా స్పేస్ కి సంభందించిన సినిమాలో అందులో లాజిక్స్ మిస్ అయితే ఎలా అండీ. పైగా క్రిటిక్స్ అలా అన్నారు అంటూ స్పెషల్ గా క్రిటిక్స్ గురించి కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఇదే విషయంపై హీరో వరుణ్ తేజ్ కూడా అదే కామెంట్ చేసాడు అని..దానిపై సంకల్ప్ స్పందిస్తూ మున్ముందు తీసే సినిమాల్లో లాజిక్స్ మిస్ అవ్వకుండా చూసుకుంటా అంటూ సెలవిచ్చాడు. మొత్తంగా చూసుకుంటే క్రిటిక్స్ అన్నారు అని కాదు కానీ..ఇలాంటి సినిమాల్లో లాజిక్స్ చాలా ముఖ్యమే!

ADVERTISEMENT
Latest Stories