ఈ సారి ఏ ‘జోనర్’ టార్గెట్ శ్రీకాంత్?

Director srikanth addalaవరుస హిట్స్ తో దూసుకుపోతున్న శ్రీకాంత్ అడ్డాలని పాపం బ్రహ్మోత్సవం సినిమా మళ్ళీ ప్లాట్ ఫార్మ్ మీదకి లాక్కొచ్చినంత పని చేసింది. దాదాపుగా మరో నాలుగు నెలలు గడిస్తే శ్రీకాంత్ అడ్డాల మెగా ఫోన్ పక్కన పెట్టి మూడు ఏళ్ళు అయిపోతుంది అంటే నమ్మండి. మరి అలాటి శ్రీకాంత్ అడ్డాల సడన్ గా కొత్త కథతో ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

పైగా అదేదో సాదా సీదా కథతో కాదు, అలా అని ఏదో సాదా సీదా నటులతో కూడా కాదు అండోయ్…ఏకంగా యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, మన విక్టరీ వెంకటేష్ తో. “కూచి పూడి వారి వీధి” అంటూ టైటిల్ వినిపిస్తున్నా ఒక సరికొత్త థ్రిల్లర్ కి ప్లాన్ చేసాడు అన్నది టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న వార్త. అయితే ఇప్పటికే కమల్, వెంకీ ఈనాడు సినిమాతో మన అందరినీ అలరించారు. పైగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆ సినిమా ఉండడంతో ఇప్పుడు రాబోయే సినిమా కూడా అదే తరహాలో ఉంటుంది అన్నది ప్రేక్షకుల ఆలోచన.

ADVERTISEMENT

కానీ శ్రీకాంత్ పూర్తి సాఫ్ట్ కధలను ఆధారంగా చేసుకునే సినిమా తీస్తాడు. మరి ఆ క్రమంలో ఈ కాంబినేషన్ ఎటువంటి అవుట్ ఫుట్ ఇస్తుందో తెలియాలి అంటే మాత్రం ఈ సినిమా గురించి అధికారికంగా విషయం బయటకు రావాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories