సో ఫార్… సూపర్… దువ్వాడ ఆన్ ‘రికార్డ్’ ట్రాక్..!

Dj Duvvada Jagannadham Gudilo Badilo Songహరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న “దువ్వాడ జగన్నాధమ్” జూన్ 23వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ డేట్ కోసం బన్నీ అభిమానులు పెద్దగా ఎదురు చూడకపోయినా… ఈ పాట చూసిన తర్వాత మాత్రం జూన్ 23 ఎప్పుడు వస్తుందా… అని నిరీక్షించడంలో తప్పులేదు. అభిమానులకు ఓ సర్ ప్రైజ్ అంటూ వదిలిన ఒక నిముషం వీడియో సాంగ్ ‘గుడిలో బడిలో మదిలో…’ పాట సంగీత సాహిత్య ప్రియులను ఒక ఊపు ఊపేలా కనపడుతోంది.

దేవిశ్రీప్రసాద్ అందించిన బీట్ మ్యూజిక్ ఫస్ట్ లుక్ లోనే అదిరిపోయే స్పందనను రాబట్టుకోవడం తధ్యం. దేవి ట్యూన్ కు తోడు పాట చిత్రీకరించిన విధానం ‘సూపర్’గా ఉండడంతో, రేపు ధియేటర్లలో అభిమానుల చేత విజిల్స్ వేయించడం ఖాయం అని చెప్పవచ్చు. ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో అద్భుతమైన పాటలను అందించిన తర్వాత, అదే తరహా బీటింగ్ మళ్ళీ ‘దువ్వాడ’తో వినపడుతోంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన మరొక అంశం ఏమిటంటే… ‘దువ్వాడ’ క్యారెక్టర్ కు తగిన విధంగానే పాట లిరిక్స్ ఉండడం..!

ADVERTISEMENT

“దువ్వాడ జగన్నాధమ్”కు సంబంధించి ఇప్పటివరకు చిత్ర యూనిట్ విడుదల చేసిన ప్రతిదీ వర్కౌట్ అయ్యింది. ఫస్ట్ టీజర్ నుండి ఈ వీడియో సాంగ్ వరకు… అన్ని పక్కాగా ప్రణాళికా బద్ధంగా విడుదల చేస్తున్నారన్న విషయం కూడా స్పష్టమైంది. దీంతో బాక్సాఫీస్ వద్ద “దువ్వాడ జగన్నాధమ్” రికార్డులు సృష్టించడానికి రైట్ ట్రాక్ లో ఉన్నారని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దిల్ రాజు నిర్మిస్తోన్న 25వ చిత్రంగా కూడా ఈ సినిమా మరింత ప్రతిష్టాత్మకతను సొంతం చేసుకుంది.

ADVERTISEMENT
Latest Stories