ఎప్పుడూ చాలా సింపుల్ గా ఉండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా జరిగిన ‘అ…ఆ…’ ఆడియో వేడుకకు మాత్రం ఒక వాచ్ ను పెట్టుకుని రావడం హాట్ టాపిక్ అయ్యింది. అయితే సాధారణంగా హంగులు, ఆర్భాటాలకు దూరంగా ఉండే పవన్ చేతికి వాచ్ చూసిన అభిమానులు దీనిని గురించి ఆరా తీయడం ప్రారంభించారు. దీంతో వారికి అవాక్కయ్యే నిజం తెలిసి వచ్చింది.
బ్రెట్లింగ్ బర్నాటో కంపెనీకి చెందిన ఈ వాచ్ గా విలువ దాదాపు 5000 డాలర్ల అని తెలుస్తోంది. దీంతో పవన్ వాచ్ సర్వత్రా హాట్ టాపిక్ అయ్యింది. గతంలో ‘ఆగడు’ సినిమా సందర్భంలో ప్రిన్స్ మహేష్ బాబు ధరించిన వాచ్ పై కూడా ఇలాంటి ఫోకస్ పెట్టిన తర్వాత అది లక్షల ఖరీదు గలిగిన వాచ్ గా గుర్తించారు. తాజాగా పవన్ వంతు వచ్చింది. సహజంగానే పవన్ వినియోగించే వస్తువులపై యూత్ లో ఒక క్రేజ్ ఉంటుంది. దీంతో ప్రస్తుతం యువత ఫోకస్ పవన్ వాచ్ పై పడింది.
ADVERTISEMENT
ADVERTISEMENT



