సినిమా బడ్జెట్ పెరిగి పోయింది టికెట్ రేట్లు పెంచాలి, బెనిఫిట్ షో లకు అనుమతి నివ్వాలి అంటూ చిత్ర బృందం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తమ తమ విన్నపాలు విన్నవిస్తుంటాయి. అయితే గతంలో ఈ సినీ పెద్దల విన్నపాలు వినడానికి జగన్ సర్కార్ ఆసక్తి చూపించకపోగా, వారిని అవమానించి పంపించింది.
కానీ ప్రస్తుతం అటు తెలంగాణలో కానీ ఇటు ఏపీ లో కానీ చిత్ర పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రభుత్వాల నుండి ఎటువంటి నిర్ణయాలు వెలువడడం లేదు. ఆ చిత్ర యూనిట్ కోరిన మేరకు వారి వారి సినిమాలకు అనుమతులు జీవోల రూపంలో బయటకొస్తున్నాయి. అయితే ఇక్కడ తెలంగాణ లో రేట్ల మాదిరే ఏపీలో కూడా టికెట్ రేట్లు పెంచడానికి ముందుకొస్తున్న సినీ పరిశ్రమ ఏపీలో మాత్రం సినిమా ప్రమోషన్లు నిర్వహించడానికి వెనకడుగు వేస్తుంది వై.?
Also Read – అందరికీ పంచింగ్ బ్యాగ్ మన టాలీవుడ్?
ఇది ఒక్క పుష్ప సినిమా గురించే కాదు గతంలో రిలీజై, బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగించిన మరికొన్ని చిత్రాలు కూడా ఏపీలో తమ సినిమా ప్రమోషన్స్ చేయడానికి ముందుకు రాలేదు. కానీ టికెట్ రేట్ల విషయంలో మాత్రం తెలంగాణ తో పాటు ఏపీ అంటున్నారు కానీ అక్కడ ప్రేక్షకులకు ప్రమోషన్ల ద్వారా దక్కిన ఎంటర్టైన్మెంట్ ఇక్కడ ప్రేక్షకులకు దక్కడం లేదు అనే ఆలోచాహ్నకు రాలేకపోతున్నారు. ఈ ఆరోపణ ఈనాటిది కాదు.
ఇక్కడ సినీ అభిమానులు కూడా వారి వారి హీరోల మీద ఉన్న అభిమానంతో ప్రభుత్వాలు ఇచ్చిన జీవో ప్రకారం జేబులకు చిల్లులు పెట్టుకుంటుని మరి సినిమాలను ఆదరిస్తున్నప్పటికీ వారికి హైద్రాబాద్ లో జరిగే ప్రమోషనల్ ఈవెంట్ల తరహాలో ఎంటర్టైన్మెంట్ కొరవడుతోంది. మరి టికెట్ రేట్ల విషయంలో రెండు రాష్ట్రాలను సమానంగా చూసుకుంటున్న సినీ పరిశ్రమ తన ప్రమోషనల్ కార్యక్రమాలను మాత్రం ఒక్క తెలంగాణకు మాత్రమే ఎందుకు పరిమితం చేస్తుంది.
Also Read – అదే వైసీపీ, బిఆర్ఎస్ నేతలకు శ్రీరామ రక్ష!
కొన్ని సినిమాల విషయంలో ఆ సినిమా అనుకున్న స్థాయి విజయం దక్కించుకుని, నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తే అప్పుడు అంటే సినిమా విడుదలైన తరువాత ఏపీలో ఒక సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అది కూడా చాల అరుదుగానే అని చెప్పాలి. ఒకవేళ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ ముందు బోర్లా పడితే ఇక ఏపీ లో ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ కు కూడా ఆస్కారం కనిపించని పరిస్థితి.
అంటే సినీ పరిశ్రమ ఏపీని ఒక ఆదాయ వనరుగానే భావిస్తుందా.? ఇక్కడి ప్రేక్షకులను విజయం వరించిన తరువాతనే పలుకరిస్తుందా.? టికెట్ రేట్ల విషయంలో సమాన న్యాయం కావాలి అంటున్న సినీ పరిశ్రమ మరి రెండు రాష్ట్రాల ప్రేక్షకులకు కూడా ఎంటర్టైన్మెంట్ సరిసమానముగా ఇవ్వాలిగా. ఎక్కడో నార్త్ కు వెళ్లి తమ సినిమాను ప్రమోట్ చెయ్యగలిగిన హీరోలు, నిర్మాతలు పక్కనే ఉన్న ఏపీకి రాలేకపోతున్నారా.? ఇది ఏ ఒక్క హీరో గురించో, ఏ ఒక్క సినిమా గురించో కాదు. సినీ పరిశ్రమకు సంబంధించిన అంశం.