కరోనా వైరస్‌లా మన ఎన్నికల హామీలు అమెరికాకు పాకాయా?

Donald Trump Dividend to Americans

కరోనా వైరస్ చైనాలో పుట్టి యావత్ ప్రపంచ దేశాలకు వ్యాపించి కోట్లాది మంది ప్రజల ప్రాణాలు బలి తీసుకుంది. అదేవిధంగా, భారత్‌లో రాజకీయ పార్టీలు ఎన్నికలలో గెలిచి అధికారం చేజిక్కించుకునేందుకు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని పట్టించుకోకుండా నోటికి వచ్చినట్లు హామీలు, సంక్షేమ పధకాలు ప్రకటిస్తుంటాయి.

వైసీపీ ఐదేళ్ళ పాలనలో సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు విచ్చలవిడిగా డబ్బు పంచుతూ ఓటు బ్యాంక్ నిర్మించుకునే ప్రయత్నం చేసింది. ఆ కారణంగా రాష్ట్రానికి సుమారు రెండున్నర లక్షల కోట్లు అప్పులు పేరుకుపోయాయని కూటమి ప్రభుత్వం ఆరోపించింది. అదే… అంత డబ్బుని రాష్ట్రంలో అభివృద్ధి పనులకు ఖర్చు చేసి ఉండి ఉంటే…?నేడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎక్కడో ఉండేది కదా?

ADVERTISEMENT

అయితే ఈ జాడ్యం ఒక్క ఏపీలో మాత్రమే కాదు దేశంలో అన్ని రాష్ట్రాలకు కరోనా వైరస్‌లా వ్యాపించింది. ఇప్పుడీ ఎన్నికల హామీ వైరస్ అమెరికాకు కూడా వ్యాపించింది. అమెరికాలో ఇలాంటి రాజకీయ హామీలు చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ ట్రంప్‌ హయంలో వీటి తీవ్రత పెరిగింది.

ఇందుకు తాజా ఉదాహరణే ట్రంప్‌ ప్రకటించిన ‘ట్రంప్‌ డివిడెండ్.’ ఈ నవంబర్‌లో జరగబోయే మధ్యంతర ఎన్నికల్లో ప్రజలు రిపబ్లికన్లను గెలిపిస్తే, ప్రతి వయోజన అమెరికన్ పౌరుడికి 5 వేల డాలర్లు (రూ.4.15 లక్షలు) చెల్లిస్తామని ట్రంప్‌ ప్రకటించారు.

కానీ ఈ హామీ అమలు చేయాలంటే కనీసం 1 ట్రిలియన్ డాలర్లు (రూ. 83 లక్షల కోట్లు) అవసరం ఉంటుంది. దీనిపై అనుమానాలు వద్దని అమెరికా ఆర్ధిక వ్యవస్థ చాలా బలంగా ఉందని ట్రంప్‌ అన్నారు.

కానీ ఆయన ఇదివరకు ఇచ్చిన ఇలాంటి హామీలనే ఇంతవరకు అమలు చేయలేకపోయారు. మరిప్పుడు కొత్తగా ప్రకటించిన ఈ ‘ట్రంప్‌ డివిడెండ్’ కోసం ఎక్కడ నుంచి డబ్బు తెస్తారు? కనుక ‘ట్రంప్‌ డివిడెండ్’ ఇస్తారనే నమ్మకం ఏమిటి? అయినా ఇన్ని లక్షల కోట్ల డాలర్లు పంచిపెట్టేస్తే అమెరికా ఆర్ధిక వ్యవస్థ కూడా మన రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థల్లా భ్రష్టు పట్టిపోకుండా ఉంటుందా?

‘అమెరికా ఫస్ట్’ అంటూ ట్రంప్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. కానీ అప్పటి నుంచి ఇరాన్‌తో యుద్ధం మొదలుపెట్టడం వరకు ఆయన తీసుకుంటున్న ప్రతీ నిర్ణయం అమెరికా ఆర్ధిక వ్యవస్థని దెబ్బ తీస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ‘ట్రంప్‌ డివిడెండ్’ అంటూ మరో విధ్వంసకర నిర్ణయం తీసుకున్నారు.

కానీ దీనిని అమలుచేయడం అసాధ్యం. కనుక ఇదే అమెరికాని ట్రంప్‌ బారి నుంచి కాపాడవచ్చు.

ADVERTISEMENT
Latest Stories