ఆయుధ నిల్వలు లేక ఉదారంగా యుద్ధ విరమణ!

Donald Trump’s Iran War Moves Spark Global Criticism

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ పదవి, తిరుగులేని అధికారం, అహంకారం, అగ్రరాజ్యమనే దురహంకారం వల్లనే ఇంత ధైర్యంగా వరుసగా తప్పులు చేయగలుగుతున్నారనేది వాస్తవం.

తద్వారా తాను నవ్వుల పాలవుతూ, అమెరికా ప్రతిష్టకు భంగం కల్గిస్తూ, అమెరికాతో సహా ప్రపంచ దేశాలకు కొత్త సమస్యలు సృష్టిస్తూ, భారీగా నష్టం కలిగిస్తున్నారు.

ADVERTISEMENT

అయినా ట్రంప్‌ తీరు మారడం లేదు. ఎందుకంటే పిల్లి మెడలో గంట కట్టే ధైర్యం ఎవరికీ లేదు కనుక!

ఇరాన్‌ మీద ఏ కారణంతో యుద్ధం మొదలుపెట్టినప్పటికీ రెండు నెలలు పూర్తికాక ముందే ట్రంప్‌ వద్ద డబ్బు, ఆయుధాలు సగం ఖాళీ అయిపోయాయి. అప్పటికీ కాల్పుల విరమణ పేరుతో మద్యలో గ్యాప్ తీసుకుంటున్నారు కూడా. కానీ ఈ విషయం చెప్పుకోలేక ఇరాన్‌పై దయ తలిచినట్లు అది ‘చర్చలకు వచ్చే వరకు కాల్పుల విరమణ’ పొడిగిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు.

నాడు ఇరాన్‌ మీద యుద్ధానికి బయలుదేరడం ఏకపక్ష నిర్ణయమే. ఇప్పుడు కాల్పుల విరమణ కూడా ఏకపక్ష నిర్ణయమే.

ఓ పక్క ఆయుధాల కోసం బిలియన్ల డాలర్లు విడుదల చేయాలని కాంగ్రెస్‌ని కోరుతూనే, ఇరాన్‌ మీద కనికరం చూపినట్లు ఒకసారి, సర్వనాశనం చేసేస్తామని మరోసారి మాట్లాడుతూ ట్రంప్‌ ‘అంతర్జాతీయ జోకర్’గా తన స్థాయి దిగజార్చుకున్నారు.

ఇలాంటి పరిస్థితిలో దౌత్యవేత్తలకు బాధ్యత అప్పగిస్తే వారు సులువుగా ఈ సమస్యలని పరిష్కరించేవారు. కానీ వారి పని కూడా ట్రంప్‌ స్వయంగా చేసేస్తున్నారు.

దౌత్యపరమైన అంశాలలో వేలు పట్టడమే కాకుండా, మీడియా ప్రకటనలు కూడా తానే చేయాలని ట్రంప్‌ అనుకోవడం వల్ల, నోటికొచ్చినట్లు అహంకారంతో మాట్లాడుతుండటంవలన ఈ సమస్య మరింత జటిలమవుతోంది. ఇరాన్‌ శాంతి చర్చలకు నిరాకరించడమే ఇందుకు నిదర్శనం.

‘వీకెండ్ పిక్నిక్ వంటి యుద్ధం’ రెండు నెలలవుతున్నా ముగియట్లేదు. ఇప్పటికే అమెరికాని, ప్రపంచ దేశాలను సగం ఆర్పేశారు. ఇంకా కొనసాగిస్తే ఏదో రోజు ట్రంపే అమెరికాను దివాళా తీయించేస్తారేమో? ‘అమెరికా ఫస్ట్’ అంటే ఇదేనేమో?

ADVERTISEMENT
Latest Stories