దొరసాని టీజర్: దొరల కాలం నాటి ప్రేమకథ

Dorasani Movie Trailer Talkకేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో రాజశేఖర్‌ – జీవితల చిన్న కుమార్తె శివాత్మిక, యువ నటుడు విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండనాయికా నాయకులుగా ‘దొరసాని’ రూపొందింది. ఈ ప్రేమకథా చిత్రాన్ని ఈ నెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ చిత్రబృందం విడుదల చేశారు. డబ్బున్న హీరోయిన్ ను పేదవాడైన హీరో ప్రేమించడం దానికి ఆ పిల్ల తల్లితండ్రులు ఒప్పుకోకపోవడం మనం చాలా సినిమాలలో చూసిందే.

అయితే అదే కథను తెలంగాణాలో స్వాతంత్రం రాకముందు ఉన్న దొరల కాలంలో చూపించడం ఈ చిత్రంలోని కొత్తదనం. అప్పట్లో దొరలు గడీ అనబడే పెద్ద పెద్ద బంగ్లాలలో ఉండేవారట. అణగారిన వర్గాల రక్తం పీల్చేవారని చరిత్ర చెబుతుంది. ఈ నేపథ్యంలో వచ్చిన దొరసాని కొత్తగా ఉందనే చెప్పుకోవాలి. కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్ అప్పటి రోజులను తలపించేలా ఉన్నాయి. ఆనంద్ దేవరకొండ డైలాగ్ డెలివరీ అచ్చు విజయ్ దేవరకొండ డైలాగ్ డెలివరీనే గుర్తుకు తెస్తోంది.

ADVERTISEMENT

అయితే ముఖకవళికలు విషయంలో టీజర్ సమయంలో హీరోగారి బాగా నెగటివ్ రావడంతో ఆ విషయంలో కొంత కేర్ తీసుకున్నారు. మొత్తానికి ట్రైలర్ ప్రామిసింగ్ గానే ఉంది. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, బిగ్‌బెన్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను జులై 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సురేష్ బాబు అండతో చెప్పుకోదగ్గిన విడుదలే సినిమాకు దక్కవచ్చు. తొలి సినిమాతోనే శివాత్మిక .. ఆనంద్ దేవరకొండ హిట్ కొడతారేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories