మాస్ క్లాస్ మేళవింపుతో బన్నీ… అల వైకుంఠపురంలో కొత్త లుక్

Dussehra Ala Vaikunthapurramuloo Allu Arjunస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హాట్ట్రిక్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘అల వైకుంఠపురంలో…’ సంక్రాంతికి విడుదలకు సిద్ధం అవుతుంది. దసరా సందర్భంగా చిత్రబృందం సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ కాసేపటి క్రితం విడుదల చేశారు. ఒక ఫైట్ సీక్వెన్స్ లోని అల్లు అర్జున్ మాస్ స్టిల్ ను విడుదల చేశారు.

ఈ పోస్టర్ కు విశేష స్పందన వస్తుంది. ఇప్పటిదాకా ఉన్న క్లాస్ ప్రమోషనల్ మెటీరియల్ తో పాటు ఈ మాస్ పోస్టర్ ని బట్టి ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి. అల వైకుంఠపురంలో’ ని మొదటిపాట ‘సామజవరగమన’ ఇటీవల విడుదలై విశేష ఆదరణకు నోచుకున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో అల వైకుంఠపురంలో… సినిమా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు తో పోటీ పడనుంది.

ADVERTISEMENT

రజినీకాంత్ దర్బార్, కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా, శర్వానంద్ శ్రీకారం కూడా సంక్రాంతికే విడుదల అవుతున్నాయి. జనవరి 12, 2020 అంటే ఆదివారం. కాకపోతే ఆ తరువాత భోగి, సంక్రాంతి, కనుమ సెలవులు వెంటవెంటనే రావడంతో జనవరి 12, 2020 నే బెస్ట్ అని నిర్మాతలు భావిస్తున్నారట.

ఈ సినిమాలో పూజా హెగ్డే, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌. రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. చాలా కాలం తరువాత టబూ ఈ సినిమాతో తిరిగి తెలుగులో నటిస్తుంది టబూ.

ADVERTISEMENT
Latest Stories