‘డీజే’ ప్లస్ అండ్ మైనస్!

Duvvada Jagannadham Allu Arjun Latest Censor UAసెన్సార్ బోర్డు నుండి ‘యు/ఎ’ సర్టిఫికేట్ అందుకున్న “దువ్వాడ జగన్నాధమ్” ఈ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సర్వం సిద్ధమవుతున్నాడు. మాస్ మెగా ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన హైలైట్స్ అండ్ మైనస్ పాయింట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో మెయిన్ హైలైట్ బన్నీనే అని తెలుస్తోంది. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉండే బన్నీ పాత్ర, బ్రాహ్మణుడి గెటప్ లో కామెడీ పండించబోతున్నట్లుగా సమాచారం.

అలాగే బన్నీ డ్యాన్స్ లు, దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం, ఫస్టాఫ్ లో పండే వినోదం, ఇంటర్వెల్ హైలైట్స్ గా “డీజే” నిలుస్తాయనేది టాక్. ఇక యధావిధిగా సెకండాఫ్ ను మెప్పించడంలో విఫలం అయ్యారని, ముఖ్యంగా క్లైమాక్స్ సినిమాకు మైనస్ గా నిలిచిందనేది ‘సెన్సార్’ నుండి వెలువడినట్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం. మొత్తమ్మీద యావరేజ్ ఫలితంతో బాక్సాఫీస్ వద్ద కాసులు వసూలు చేసే కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు దిల్ రాజు – హరీష్ శంకర్ ల కాంబో తీసుకు వస్తున్నట్లుగా తెలుస్తోంది.

ADVERTISEMENT

ఏపీ, తెలంగాణాలతో పాటు యుఎస్ లోనూ రికార్డ్ సెంటర్స్ లో “దువ్వాడ జగన్నాధమ్”ను విడుదల చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రీమియర్స్ ను దాదాపుగా 300 స్క్రీన్లలో ప్రదర్శించేలా చూస్తున్నారని, ‘బాహుబలి’ తర్వాత యుఎస్ లో అన్ని స్క్రీన్స్ లో ప్రదర్శించడం “డీజే”కే దక్కుతుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి ‘బాహుబలి 2’ సక్సెస్ ఒరవడిని బాక్సాఫీస్ వద్ద “దువ్వాడ” కొనసాగిస్తాడో లేదో తెలియాలంటే మరో 5 రోజులు వెయిట్ చేయాల్సిందే.

ADVERTISEMENT
Latest Stories