బన్నీ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న పూజా!

Duvvada Jagannadham Bengaluru Promotions Pooja Hegdeఇటీవల ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ల గురించి, వారికి సూట్ అయ్యే కాస్ట్యూమ్స్ గురించి అల్లు అర్జున్ చాలా డీటైల్డ్ గా చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రస్తుతం “దువ్వాడ జగన్నాధమ్” నటించిన పూజా హెగ్డేకు సూట్ అయ్యే కాస్ట్యూమ్స్ గురించి చెప్తూ… తనవి పొడవైన లెగ్స్ అని, అందుకని షార్ట్స్ వేస్తే చాలా బాగుంటుందని బన్నీ కితాబిచ్చాడు. బహుశా ఈ ముక్క పూజా చెవిలో పడిందో ఏమో గానీ, ఆ రోజు నుండి ఇప్పటివరకు కనిపించిన ప్రతిసారి పూజా షార్ట్ డ్రెస్ లతో కనిపిస్తూ, తన హాట్ లెగ్స్ ను ప్రదర్శిస్తోంది.

బన్నీ ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత… ఇద్దరూ కలిసి మొదటిసారిగా యూ ట్యూబ్ లో లైవ్ లో ప్రత్యక్షమయ్యారు. ఆ సందర్భంలో పూజా వైట్ ఫ్రాక్ తో లెగ్స్ కనపడే విధంగా హాట్ హాట్ కాస్ట్యూమ్స్ ను ధరించింది. ఆ తర్వాత టీం మొత్తం కూర్చుని ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అలాంటి డ్రెస్ తోనే కన్నులవిందు చేసింది పూజా. ఇక “డీజే” ప్రమోషన్ లో భాగంగా బెంగుళూరు పయనమైన సందర్భంలోనూ బన్నీ పక్కన ఉన్న పూజా, టీ షర్టు, షార్ట్ జీన్స్ ధరించి తన హాట్ లెగ్స్ రేంజ్ ఏంటో ఎయిర్ పోర్ట్ ప్రేక్షకులకు తెలియజెప్పింది.

ADVERTISEMENT

ఇక తాజాగా బెంగుళూరులో ప్రమోషన్స్ చేస్తున్న సమయంలోనూ బన్నీ చెప్పిన కాస్ట్యూమ్స్ తరహాలోనే తన లెగ్స్ ను ప్రదర్శిస్తూ దర్శనమిచ్చింది పూజా హెగ్డే. తన సినీ హీరో చెప్పాడని అలా వేసుకుంటుందో లేక తనకు నచ్చిన కాస్ట్యూమ్స్ అని ధరిస్తుందో గానీ, ఈ రెండు ఒకేసారి జరగడం కాకతాళీయం అనాలా? లేక బన్నీ వ్యాఖ్యలను పూజా సీరియస్ గా తీసుకుని ఫాలో అయిపోతుందా..! ఏది ఏమైనా బన్నీ చెప్పినట్లు షార్ట్ డ్రెస్ లు పూజకు మాత్రం భలే ఉన్నాయి అని అనుకోవడం వీక్షకుల వంతవుతోంది.

ADVERTISEMENT
Latest Stories